ETV Bharat / sports

ముంబయి ఐదోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? - mumbai ipl trophy win moments

ఐపీఎల్​ చరిత్రలో నాలుగు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్​.. ఈ సారి సీజన్​లో దుమ్మురేపి పైనల్​కు చేరుకుంది. ఈ పోరులో విజయంతో ఐదో సారి ట్రోఫీని ముద్దాడి తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సందర్భంగా రోహిత్​ సేన ఇప్పటివరకు విజేతగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకుందాం.

mumbai indians
ముంబయి
author img

By

Published : Nov 10, 2020, 2:02 PM IST

ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్​ ఒకటి. లీగ్​ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు విజేతగా నిలిచిన రోహిత్​ సేన​.. ఈ సీజన్​లోనూ అదరగొట్టింది. ఆడిన 15 మ్యాచుల్లో 10 గెలిచి ఫుల్​జోష్​లో ఉంది. క్వాలిఫయర్​1 మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​పై విజయం సాధించి ఫైనల్స్​కు అర్హత సాధించింది.

క్వాలిఫయర్​ 2 పోరులో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలుపొంది.. టోర్నీ చరిత్రలోనే తొలి సారి ఫైనల్స్​లో అడుగుపెట్టింది దిల్లీ క్యాపిటల్స్​. ఇరుజట్లు అంతిమ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే లీగ్​లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం సహా.. దిల్లీతో తలపడ్డ మూడుసార్లు విజయాన్ని అందుకున్న ముంబయే ఈ మ్యాచ్​లో ఫేవరేట్​. ఈ సందర్భంగా ఇప్పటివరకు రోహిత్​ సేన ట్రోఫీలను ఎగరేసుకుపోయిన సందర్భాల్ని నెమరువేసుకుందాం.

  1. 2013లో అద్భుతంగా ఆడిన ముంబయి ఇండియన్స్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో లీగ్​లో తొలిసారి విజేతగా నిలిచి, కప్పును ముద్దాడింది.
  2. 2015లో సీజన్​ను పేలవంగా ప్రారంభించిన ముంబయి.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్​లలో అద్భుతాలు చేసి ఫైనల్​కు చేరింది. అందులో 41పరుగుల తేడాతో రెండోసారి చెన్నైపైనే గెలిచి కప్పును అందుకుంది రోహిత్​ సేన.
  3. ​2017లో ముంబయి ఇండియన్స్​ లీగ్​ దశ నుంచే అదిరిపోయే ఆటతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయిర్​-1లో పుణె సూపర్​జెయింట్స్​ చేతిలో ఓడినా సరే .. క్వాలిఫయిర్​-2లో కోల్​కతా​ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో 1 పరుగు తేడాతో పుణెపై గెలిచి మూడోసారి విజేతగా నిలిచింది ముంబయి.
  4. 2019లో హైదరాబాద్​ వేదికగా జరిగిన ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో ముంబయి 1పరుగు తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​పై విజయం సాధించి ​నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: ఫైనల్​ ముందు ముంబయి జట్టుకు సచిన్ సందేశం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.