Ind Vs Sa Test Series 2023 : 2023 వరల్డ్‌కప్ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లో యువ భారత్ అదరగొట్టింది. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను 1-1తో సమం చేయగా, 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను నెగ్గింది. ఇక ఈ పర్యటనలో అందరూ ఎదురుచూస్తున్న టెస్టు సిరీస్‌కు సమయం దగ్గరపడింది. ఈ నెల 26న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం భారత్‌కు అందని ద్రాక్షలాగే ఉంది. దీంతో ఈసారైనా సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించి చరిత్ర తిరగరాయాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ఇక రోహిత్, కోహ్లీ రాకతో భారత్ మరింత పటిష్ఠంగా కనిపిస్తోంది.
ఇన్నేళ్లపాటు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవకపోడానికి అక్కడి పిచ్‌లు కూడా ఒక కారణం. పేస్, స్వింగ్, బౌన్స్‌కు, సహకరించే పిచ్‌లపై బుల్లెట్లలా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం మనోళ్లకు సవాలే. అయితే ఇలాంటి పరిస్థితులు టీమ్ఇండియా బౌలర్లలకూ సానుకూలమే. ప్రస్తుతం మన పేస్ దళం కూడా దృఢంగా ఉంది. ఒకరకంగా ఇది టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక ఆతిథ్య జట్టు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బ్యాటర్లు రాణిస్తే తిరుగుండదు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడగలిగితే పరుగులు సాధించడం సులువు అవుతుంది.
భారత్- సౌతాఫ్రికా (సఫారీ గడ్డపై) గత టెస్టు సిరీస్‌ల ఫలితాలు :
- భారత్ సఫారీలతో 1992లో తొలిసారి టెస్టు సిరీస్ ఆడింది. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-0తో గెలుచుకుంది. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా నెగ్గాగా, మిగిలిన 3 మ్యాచ్‌లు డ్రా గా ముగిశాయి.
- 1996లో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో భారత్ ఓటమి చవిచూసింది. రెండు మ్యాచ్‌ల్లో సఫారీలు విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రా అయ్యింది.
- 2001లో రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య సౌతాఫ్రికా 1-0 తేడాతో గెలుచుకుంది. ఇందులో ఓ మ్యాచ్‌లో భారత్ ఓడగా, మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
- 2006 సిరీస్‌లో టీమ్ఇండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్‌లో విజయం అందుకుంది. కానీ, తర్వాత మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించి 2 విజయాలు నమోదు చేసింది. దీంతో 2-1తో సిరీస్ మరోసారి సఫారీల ఖాతాలోని వెళ్లింది.
- 2010లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగింది. మూడు టెస్టు సిరీస్‌ను భారత్ తొలిసారి 1-1తో డ్రా గా ముగించింది. ఈ సిరీస్‌లో వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ టీమ్ఇండియాకు కీలకంగా వ్యవహరించారు.
- 2013 సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్ ఈసారి రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఇందులో ఒక మ్యాచ్‌లో సౌతాఫ్రికా నెగ్గగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో 1-0 తేడాతో మళ్లీ సఫారీలు సిరీస్ గెలుచుకున్నారు.
- ఐదేళ్ల తర్వాత 2018లో సఫారీ గడ్డపై భారత్- సౌతాఫ్రికా తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1తో గెలుచుకుంది.
- ఇక చివరగా భారత్ 2021లో టెస్టు సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లోనే నెగ్గి లీడ్‌లోకి వెళ్లింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది.
-
The Ultimate Test ❗
— Proteas Men (@ProteasMenCSA) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We are shifting to Red-ball cricket mode as the exciting Boxing Day Test against India starts on Tuesday 🏏
A story of 2️⃣ global icons 🇿🇦🇮🇳
🎫 Get your tickets at TicketPro ➡️ https://t.co/T6DwbjS2so#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/IA7gHaUdAY
">The Ultimate Test ❗
— Proteas Men (@ProteasMenCSA) December 22, 2023
We are shifting to Red-ball cricket mode as the exciting Boxing Day Test against India starts on Tuesday 🏏
A story of 2️⃣ global icons 🇿🇦🇮🇳
🎫 Get your tickets at TicketPro ➡️ https://t.co/T6DwbjS2so#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/IA7gHaUdAYThe Ultimate Test ❗
— Proteas Men (@ProteasMenCSA) December 22, 2023
We are shifting to Red-ball cricket mode as the exciting Boxing Day Test against India starts on Tuesday 🏏
A story of 2️⃣ global icons 🇿🇦🇮🇳
🎫 Get your tickets at TicketPro ➡️ https://t.co/T6DwbjS2so#WozaNawe #BePartOfIt #SAvIND pic.twitter.com/IA7gHaUdAY
-
టీమ్ఇండియాకు షాక్- ఆ మ్యాచ్‌లకు ఇషాన్, సూర్య దూరం- కారణాలివే
'మా కుర్రాళ్లకు ఇచ్చిన మెసేజ్ అదే- అందుకే సంజుకు అప్పట్లో ఛాన్సులు రాలేదు'