ETV Bharat / sports

IND vs SA Test: వాండరర్స్‌ మైదానంలో వికెట్‌.. కుంబ్లే తర్వాత అశ్వినే! - వాండరర్స్​లో అశ్విన్ వికెట్

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. మాజీ స్పిన్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌ మైదానంలో వికెట్‌ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు.

ashwin
అశ్విన్
author img

By

Published : Jan 6, 2022, 9:16 PM IST

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా మాజీ స్పిన్‌ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌ మైదానంలో వికెట్‌ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు.

2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. వాండరర్స్‌లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే (2/2, 3/54) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా ఆ టెస్టులో 123 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. అప్పటి నుంచి టీమ్‌ఇండియా రెండు సార్లు (2013-14, 2017-18) దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. తాజా పర్యటనలో భాగంగా వాండరర్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. కీగన్‌ పీటర్సన్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌లో వికెట్ తీసిన భారత స్పిన్నర్‌గా అశ్విన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు.

ఇదీ చదవండి:

ద్రవిడ్​తో కలిసి కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​.. మూడో టెస్టుకు అందుబాటులోకి!

IND vs SA 2nd Test: ఎల్గర్​ అర్ధసెంచరీ- విజయం దిశగా సౌతాఫ్రికా

IND vs SA: 'హార్దిక్‌ లేని లోటును శార్దూల్‌ భర్తీ చేస్తున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.