ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 worldcup schedule) ప్రారంభ టోర్నీలోనే టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. తర్వాత మరో పొట్టి కప్పు సాధించాలని చూసినా కుదరలేదు. అప్పటి నుంచి కలగానే మిగిలిపోయింది. ఈసారైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో సత్తా చాటేందుకు టీమ్ఇండియా సంసిద్ధంగా ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడింది. అయితే ఈ మెగాటోర్నీలో సత్తాచాటాలంటే భారత జట్టులో బ్యాట్స్‌మెన్ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్‌తో పాటు బౌలర్లు అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఎంతో కీలకం. బౌలర్లలో అశ్విన్, జడేజాకు అయితే గత ప్రపంచకప్‌ల్లో మంచి రికార్డులను అందుకున్న అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఓ తెలుసుకుందాం..
రవిచంద్రన్ అశ్విన్
టీ20 ప్రపంచకప్‌లో(ravichandran ashwin t20 wickets) భారత్ తరఫున ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీశాడు. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2017లో వెస్టిండీస్‌పై ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ ఇతడు అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
హర్భజన్ సింగ్
2007-2012వరకు(harbhajan singh wickets) పొట్టి క్రికెట్ ఆడిన హర్భజన్ సింగ్.. టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో అత్యధిక(4) మెయిడిన్ ఓవర్లు వేసిన ప్లేయర్‌గానూ రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు 16 వికెట్లు తీశాడు.
ఆశిష్ నెహ్రా
పొట్టి క్రికెట్లో(ashish nehra world record) 2009 నుంచి 2016 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. టీ20 స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచకప్‌లో తాను ఆడిన మ్యాచ్‌ల్లో 17.93 సగటు, 6.89ఎకానమీతో 15వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఇర్ఫాన్ పఠాన్
2007 ప్రపంచకప్ విజయంలో(irfan pathan wickets) కీలకంగా వ్యవహరించిన ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 15 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2012 వరల్డ్ కప్‌లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.
రవీంద్రజడేజా, ఆర్పీ సింగ్
ఈసారి టీ20(ravindra jadeja t20 wickets) ప్రపంచకప్‌లో జడేజా కీలకంగా వ్యవహరిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు జడ్డూ 14 వికెట్లను పడగొట్టాడు. మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా 14 వికెట్లతో ఉన్నాడు. ఆర్పీ తొమ్మిది మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకోగా.. జడ్డూ 17మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించాడు.
జహీర్‌ఖాన్
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున తక్కువ మ్యాచ్‌లే ఆడినా.. వరల్డ్‌కప్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లిఖించుకున్నాడు లెజండరీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. 2011 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా తాను ఆడిన మ్యాచ్‌ల్లో 12వికెట్లు పడగొట్టి అందరీ దృష్టినీ ఆకర్షించాడు. జహీర్.. టీ20 అరంగేట్రం 2006లో దక్షిణాఫ్రికాపై చేశాడు. మొత్తంగా కెరీర్లో 17 టీ20లు మాత్రమే ఆడాడు.
టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 24న టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో(teamindia pakisthan match 2021) ఆడబోతుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీలో భారత జట్టుకు మాజీ సారథి ధోనీ మెంటార్‌గా ఉండటం విశేషం.
ఇదీచూడండి: olympic gold winner: బల్లెం వీరుడు నీరజ్ వేట.. మళ్లీ మొదలైంది