ETV Bharat / sports

Womens Cricket: టీమ్​ఇండియాకు నిరాశ.. తొలి టీ20 ఇంగ్లాండ్​దే - England vs India

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో 18 పరుగుల తేడాతో భారత్​ మహిళల జట్టు ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్​ మధ్యలోనే నిలిచిపోగా, డక్​వర్త్​ లూయిస్​ పద్ధతిలో విజేతను ప్రకటించారు.

England vs India
టీమ్ఇండియా
author img

By

Published : Jul 10, 2021, 9:48 AM IST

ఇంగ్లాండ్​తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది భారత మహిళల జట్టు. వర్షం కారణంగా మ్యాచ్ సగంలోనే ఆగిపోయింది. దీంతో డక్​వర్త్​ లూయిస్​ పద్ధతిలో ఇంగ్లాండ్ గెలుపోందింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​.. నటాలియే సివర్​ అద్భుత అర్ధశతకం(55) సహా ఏ జోన్స్​(43) రాణించగా 177/7 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే 3/22 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేసింది.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా.. తొలి ఓవర్​ రెండో బంతికే ఓపెనర్​ షెఫాలీ వర్మ వికెట్​ కోల్పోయింది. స్మృతి మంధాన (29) ఫర్వాలేదనిపించింది. భారత్.. 8.4 ఓవర్లలో 54/3 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్​ నిలిచిపోయింది. దీంతో డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం 18 పరుగుల తేడాతో మ్యాచ్​ ఇంగ్లాండ్ వశమైంది.

ఇదీ చూడండి: శ్రీలంక జట్టులో కరోనా కలకలం.. భారత్​తో సిరీస్ జరిగేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.