ETV Bharat / sports

ప్రపంచకప్​లో తెలు'గోడు' వినలేదు..! - ప్రపంచకప్

నాలుగేళ్లకోసారి జరిగే క్రికెట్​ సంగ్రామం.. అందుకోసం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని జట్టును ప్రకటించింది బీసీసీఐ. తెలుగు క్రీడాకారులు సత్తా చాటుతున్నా.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో మాత్రం స్థానం లభించడం కష్టమవుతోంది. దీనిని నిజం చేస్తూ అప్పట్లో వీవీఎస్​ లక్ష్మణ్​ లాగే .. ఇప్పుడు అంబటి రాయుడికి మొండిచేయి చూపించింది.

ప్రపంచకప్​లో తెలు'గోడు' వినలేదు..!
author img

By

Published : Apr 16, 2019, 9:46 PM IST

Updated : Apr 17, 2019, 12:08 AM IST

2019 ప్రపంచకప్​ జట్టు కూర్పులో.. అద్భుతంగా రాణిస్తున్న అంబటి రాయుడును తీసుకోకపోవడం వెనుక కారణమేంటి..? మాజీ క్రికెటర్లే నిర్ఘాంతపోతూ ప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్​​ తరఫున వన్డేల్లో నాలుగో అత్యధిక బ్యాటింగ్​ సగటు అంబటిదే.

.

  1. విరాట్ కోహ్లీ (59.57), ధోని (50.37), రోహిత్ (47.39) తర్వాత బ్యాటింగ్​ సగటులో రాయుడు (47.05) నాలుగో స్థానంలో ఉన్నాడు.
  2. 2013లో భారత వన్డే జట్టులోకి ఎంపికైన రాయుడు ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు ఆడి 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాయుడు తడబడ్డాడు. 10 వన్డేలు ఆడి ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు.

ఎన్నో వదులుకున్నా...

ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం ఏడాది కాలం నుంచి హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. రంజీకి వీడ్కోలు పలికి వన్డే ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఆసియా కప్‌లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. టీమిండియాలో ‘నాలుగో ’ స్థానానికి రాయుడు కచ్చితంగా సరిపోతాడు అనుకున్న అభిమానులకు బీసీసీఐ షాక్​ ఇచ్చింది. రాయుడును కాదని తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌వైపు బోర్డు మొగ్గు చూపింది.

కెరీర్​ ముగిసినట్లేనా...

2015 ప్రపంచకప్‌ భారత జట్టులో రాయుడు ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. 33 ఏళ్ల రాయుడు ఈసారి మంచి ఫామ్‌ కనబరిచి.. నాలుగో స్థానంలో కీలకంగా రాణించినా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2023 ప్రపంచకప్​నకూ ఇదే ఫామ్​ సహా వయసు పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. యువ ఆటగాళ్ల రాకతో అంబటి కెరీర్​ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్​​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Ambati Rayudu must be shattered though. His place was deemed certain and he had even quit 4 day cricket to focus on this. But form is such a cruel mistress. The harder he tried the more he seemed to struggle. My heart goes out to him.

    — Harsha Bhogle (@bhogleharsha) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సెలక్టర్ల సమాధానం...

ఈ ఏడాదే అరంగేట్రం చేసిన విజయ్‌ శంకర్​కు ఆడిన 9 మ్యాచ్​ల్లో ఐదింట్లో బ్యాటింగ్​ అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌పై 45, ఆస్ట్రేలియాపై వరుసగా 46, 32, 26, 16 పరుగులు సాధించాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేయగల నేర్పుతో పాటు బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయుడుకు బదులుగా విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశామని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు. ఎమ్మెస్కే ఆంధ్రాకు చెందినవారు కావడం విశేషం.

AP Video Delivery Log - 1200 GMT News
Tuesday, 16 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1151: France Notre Dame Ministers 2 AP Clients Only 4206280
Culture minister on recovery of Notre Dame art
AP-APTN-1143: France EU Brexit AP Clients Only 4206282
Tusk, Juncker on conclusions of EU Brexit meeting
AP-APTN-1136: Germany Notre Dame No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4206284
Steinmeier, architect, cardinal on Notre Dame
AP-APTN-1131: Internet Notre Dame Support AP Clients Only 4206276
LVMH group pledges for Notre Dame, UK Royals
AP-APTN-1126: Vatican Notre Dame 2 AP Clients Only 4206279
Cardinal: Vatican could offer Notre Dame support
AP-APTN-1117: France UK Notre Dame History AP Clients Only;No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206271
Historian: Notre Dame a 'treasure trove' of relics
AP-APTN-1111: Switzerland UN Notre Dame AP Clients Only 4206274
UN ready to send Notre Dame 'emergency mission'
AP-APTN-1100: France Notre Dame Ministers AP Clients Only 4206269
French ministers visit Notre Dame after fire
AP-APTN-1033: Vatican Notre Dame AP Clients Only 4206267
Vatican: Pope prays for French catholics
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 17, 2019, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.