ETV Bharat / sports

మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారో తెలుసా..?

క్రికెట్​లో పాటించే నియమాలు, విధానాలూ తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. అయితే మ్యాచ్ అయ్యాక ఆ బంతిని ఏం చేస్తారో చాలా మంది పట్టించుకోరు. మరి వాడేసిన ఆ బంతిని ఏం చేస్తారు? తెలుసుకోవాలనుందా. అయితే చూసేయండి.

what will do the used ball  after completeing the match
మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారో తెలుసా..?
author img

By

Published : Jun 1, 2020, 5:48 PM IST

మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారో తెలుసా..?

క్రికెట్.. ఈ పదానికి భారత్​లో ఉన్నంత క్రేజ్ మరెక్కడా లేదు. మన దేశంలో ఉన్నంత మంది క్రికెట్​ అభిమానులు మరెక్కడా ఉండరు. ​మ్యాచ్ వస్తోందంటే పనులు మానుకుని టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్​లో అంతలా లీనమైపోయే అభిమానులు మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారు అన్న విషయాన్ని మాత్రం దాదాపు పట్టించుకోరు. మరి ఆ బంతిని ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు జవాబు వెతికితే.. ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

ఒకవేళ ఏదైనా మ్యాచ్​లో బౌలర్​ 5 లేదా 10 వికెట్లు తీసుకుంటే అతడు బంతిని తీసుకెళ్లొచ్చు. అదే ప్రత్యేకమైన మ్యాచ్​ అయితే స్టేడియానికి చెందిన క్రికెట్​ సంఘం ఆ బాల్​ను వేలం వేస్తుంది. లేకపోతే జ్ఞాపకంగా దాచిపెడుతుంది.

సాధారణ మ్యాచ్​ల్లో వినియోగించిన బంతులను నెట్స్​లో ప్రాక్టీస్​ కోసం వాడతారు.

బంతి కనుమరుగైనప్పుడు...

ఒకవేళ బంతి స్టేడియం బయటకు వెళ్లి కనిపించకుండా పోతే? గత మ్యాచ్​లలో ఉపయోగించిన పాత బంతిని వాడతారు. అలా ప్రత్యామ్నాయంగా తెచ్చిన బంతి కూడా కనిపించకుండాపోతే మళ్లీ మరో పాత బాల్​ని వినియోగిస్తారు. ఈ విషయంలో అంపైర్​దే తుది నిర్ణయం.

మరి ఐపీఎల్​లో...

ఐపీఎల్​లో అయితే ప్రచారం కోసం సూపర్​ఫ్యాన్​ పేరుతో స్టేడియంలోని ఓ అభిమానికి బంతిని బహుమతిగా ఇస్తారు.

క్రికెట్​పై ఆసక్తి ఉన్నా... ఆడేందుకు సరైన సౌకర్యాలు లేని క్రీడాకారులకు కొన్నిసార్లు బంతులను బహుమతిగా ఇస్తారు.

పాతవాటితో కొత్తవి...

ఒకవేళ మ్యాచ్​ తర్వాత కూడా బంతి ఆకారం మారకుండా ఉంటే... అవసరమైతే మరో మ్యాచ్​లో వాడతారు. ఆకారం మారితే జ్ఞాపకంగా పదిలపరుస్తారు. మరికొన్నిసార్లు పాత బంతులతో కొత్తవి తయారు చేస్తారు.

ఇదీ చూడండి : సంపాదనలో పురుష క్రికెటర్లతో భారత మహిళలు పోటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.