ETV Bharat / sports

'ఇంగ్లాండ్​ జట్టు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి'

author img

By

Published : Feb 16, 2021, 5:31 AM IST

స్పిన్​కు అనుకూలించే పిచ్​ల విషయమై ఇంగ్లాండ్​ జట్టు తమ ఆలోచన తీరును మార్చుకోవాలని సూచించాడు టీమ్​ఇండియా లెఫ్ట్​ఆర్మ్​ స్పిన్నర్​​ అక్సర్​ పటేల్​. కాగా, తాను తొలి టెస్టుకు గాయంతో దూరమైనప్పుడు చికాకు, బాధ పడకుండా ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించినట్లు చెప్పాడు.

axar
అక్సర్​ పటేల్​

చెపాక్​లో సరైన లెంగ్త్​, వేగంతో బంతిని విసరకపోతేనే.. పిచ్ బౌలర్లకు సవాల్​గా మారుతుందని చెప్పాడు టీమ్​ఇండియా లెఫ్ట్​ఆర్మ్​ స్పిన్నర్​​ అక్సర్​పటేల్​. స్పిన్​కు అనుకూలించే పిచ్​ల విషయమై ఇంగ్లాండ్ జట్టు​ తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించాడు. చెపాక్​ పిచ్​ నాణ్యత లేదని పలువురు మాజీలు విమర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు అక్సర్​.

"చెపాక్​ పిచ్​పై సరైన లెంగ్త్​, వేగంతో విసిరితేనే బంతి టర్న్​ అవుతుంది. లేదంటే బంతి స్పిన్​ అవ్వదు. అదే బంతిని సరిగ్గా విసిరితే వాటిని ఎదుర్కోవడం బ్యాట్స్​మన్​కు కష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ వికెట్/పిచ్​పై మేం బాగానే ఆడాం. మేం పరుగులు చేయగలిగినప్పుడు వారికి ఇలాంటి సమస్యలు ఉంటాయని అనుకోను. పిచ్ గురించి వాళ్లు తమ ఆలోచనను మార్చుకుంటే బాగుంటుంది. ఇంగ్లాండ్ వంటి చోట్ల సీమింగ్(ఫాస్ట్ బౌలింగ్) వికెట్లపైనా మేం ఆడతాం కదా." అని అక్సర్​ ప్రశ్నించాడు.

కాగా, ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా తాను దూరమయినప్పటికీ చికాకు, బాధ పడకుండా.. రెండో టెస్టుపై దృష్టి సారించినట్లు చెప్పాడు. ఫిట్​నెస్ కోసం బాగా కసరత్తులు చేసినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచుతోనే టెస్టు అరంగేట్రం చేసిన అతడు​.. ఈ పోరులో ఇప్పటికీ రెండు వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: అశ్విన్​.. టీమ్​ఇండియాకు అలా 'అన్న'గా మారాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.