దిగ్గజ సచిన్ తెందుల్కర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టినట్లు అందరికీ తెలుసు. కానీ సచిన్ ఓపెనర్‌గా ఎలా మారాడన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు! 1994 న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తాను ఓపెనర్‌గా మారడానికి గల కారణాలను గుర్తుచేసుకున్నాడు లిటిల్ మాస్టర్.
విఫలమైతే మళ్లీ అడగను
"ఉదయం హోటల్ నుంచి బయల్దేరినప్పుడు ఓపెనింగ్ చేస్తానని తెలియదు. మైదానానికి వెళ్లేసరికి కెప్టెన్ అజహర్, కోచ్ వాడేకర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. మెడ నొప్పి కారణంగా నవ్‌జ్యోత్ సిద్ధూ ఫిట్‌గా లేడని.. ఎవరితో ఇన్నింగ్స్ ఓపెన్ చేయిద్దామని అడిగారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వమని అడిగా. ఆరంభంలో బౌలర్లపై ఎదురుదాడి దిగి, తర్వాత పరిస్థితులకు తగ్గట్టుగా ఆడతానని చెప్పా. అప్పట్లో తొలి 15 ఓవర్లు నెమ్మదిగా ఆడి.. బంతిపై మెరుపు తగ్గాక గేర్లు మార్చి.. చివరి 7, 8 ఓవర్లలో పూర్తిస్థాయిలో చెలరేగి పరుగులు రాబట్టేవారు. తొలి 15 ఓవర్లలో దూకుడుగా ఆడితే ప్రత్యర్థిపై ఒత్తిడి తేవొచ్చని భావించా. అందుకే ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగా. విఫలమైతే మళ్లీ అడగనని చెప్పా. ఆ ప్రయత్నం విజయవంతమైంది" అని సచిన్ చెప్పాడు.
ఆ మ్యాచ్‌ల్లో సచిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అప్పట్నుంచి రిటైరయ్యే వరకు వన్డేల్లో టీమిండియాకు సచిన్ ఓపెనర్‌గా కొనసాగాడు.
ఇదీ చదవండి: సారథి అయినా.. దూకుడు తగ్గదు: కోహ్లీ