ETV Bharat / sports

సారథి అయినా.. దూకుడు తగ్గదు: కోహ్లీ - kohli updates

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ... తాను టెస్టు క్రికెట్​ ఆడడం వల్ల మరింత మెరుగయ్యాడని తెలిపాడు. క్రికెట్​పై తనకున్న ఇష్టాన్ని, తాను శాకాహారిగా మారడంపై ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడాడు.

Virat Kohli reveals he likes and  most preferred test format
టెస్టు క్రికెట్‌తో వ్యక్తిగా మెరుగయ్యా
author img

By

Published : Apr 3, 2020, 7:22 AM IST

టెస్టు క్రికెట్‌ ఆడడం వల్ల వ్యక్తిగా తాను మరింత మెరుగయ్యానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. టెస్క్రికెట్‌ అంటే తనకున్న ఇష్టం, తాను శాకాహారిగా మారడం గురించి కోహ్లి ప్రస్తావించాడు. ఫేవరెట్‌ ఫార్మాట్‌ ఏదని అడిగినప్పుడు.. 'టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌, టెస్టు క్రికెట్‌' అంటూ బలంగా నొక్కి చెప్పాడు. అదే ఎందుకన్నది కూడా వివరించాడు.

"ఎందుకంటే అది జీవితానికి ప్రతిరూపం. నువ్వు పరుగులు చేసినా చేయకున్నా ఇతరులు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలి. నీ గదికి వెళ్లి పడుకొని, తెల్లారి లేచి మళ్లీ మైదానానికి రావాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా దినచర్యను అనుసరించాల్సిందే. జీవితంలాగే ఇది కూడా. పోటీపడడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. టెస్టు క్రికెట్‌ నన్ను మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దింది"

-కోహ్లి, టీమిండియా క్రికెటర్​.

దేవుడికి కృతజ్ఞతలు

కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతున్న ఈ సమయంలో తాను అత్యంత సౌకర్యంగా ఉన్నానని, అందుకు భగవంతుడికి కృతజ్ఞుడినని కోహ్లి అన్నాడు.

"ప్రజలు ఉద్యోగాల కోసం ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో ఇప్పుడు నేను ఉన్న స్థితికి ఆ దేవుడికి కృతజ్ఞుడిగా ఉంటా. ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని లేని దాని గురించి బాధ పడడంలో అర్థం లేదు. కరోనాపై పోరాటంలో అందరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించాలి."

-కోహ్లీ.

అందుకే మాంసం మానేశాను..

శాకాహారిగా మారడం గురించి మాట్లాడుతూ.. 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా తాను ఎదుర్కొన్న వెన్ను సమస్య గురించి వివరించాడు కోహ్లి.

"అప్పుడు నా చిటికెన వేళ్లలో స్పర్షే తెలియలేదు. ఎసిడిటీతో ఇబ్బంది పడ్డా. ఎముకల్లో కాల్షియం వెళ్లిపోయేది. ఆ క్రమంలోనే మాంసాహారం మానేశా. ఆ తర్వాత ఫిట్‌గా తయారయ్యా. ఇప్పుడు నేను కాస్త విరామంతో 120 శాతంతో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడగలను"

-కోహ్లీ.

ఇలాగే ఉంటా..

జట్టుకు నాయకత్వం వహిస్తున్నంత మాత్రాన తాను దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని కోహ్లి అన్నాడు. "నేను కెప్టెన్‌ను అయినంత మాత్రాన నాలోని దూకుడును పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఆటను ఆస్వాదించగలగాలి. ఆ తర్వాత వ్యూహాల గురించి ఆలోచించాలి"అని కోహ్లి అన్నాడు. అయితే తాను జీవితంలో ఎప్పటికీ ఏబీ డివిలియర్స్‌ను స్లెడ్జింగ్‌ చేయనని, అతడంటే తనకు అపార గౌరవమని చెప్పాడు. "ఐపీఎల్‌ వల్ల మాకు ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. నేను ఎప్పటికీ ఏబీని స్లెడ్జింగ్‌ చేయలేను. ఎప్పటికీ నిలిచి ఉండే స్నేహం మాది"అని చెప్పాడు. ఎవరితో కలిసి బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతావని పీటర్సన్‌ అడగగా.. ఏబీతో పాటు ధోని పేరు చెప్పాడు కోహ్లి. "వికెట్ల మధ్య నా పరుగును అర్థం చేసుకునే వారితో కలిసి బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతా. ఏబీ, ధోనీతో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. పరుగు కోసం మేం పిలుచుకోనే పిలుచుకోం. ఒకరిని ఒకరం చూసుకుంటే మాకు అర్థమవుతుంది" అని వివరించాడు.

ఆమెతో ఇలా..

తన భార్య అనుష్కతో కలిసి ఇంత సమయం తాను ఎప్పుడూ గడపలేదని కోహ్లి అన్నాడు. "ఒకే ప్రదేశంలో మేమెప్పుడూ ఇన్ని రోజులు కలిసి ఉండలేదు. దానికి కారణం కరోనా అయినందుకు ఏదోలా అనిపిస్తోంది. కలిసి ఉండేందుకు అది ఓ మంచి అవకాశం ఇచ్చిందని చెప్పలేం. కానీ కారణమైతే అదే. మేం సానుకూల దృక్పథంతో ఉంటున్నాం. పరిస్థితులు ఇలా ఉండకపోతే చిన్నస్వామి స్టేడియంలో ఉండేవాణ్ని" అని చెప్పాడు.

ఇదీ చూడండి : 'రిటైర్మెంట్​ గురించి అడిగితే ధోనీకి కోపమొస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.