విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ను గుర్తు చేస్తుందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు. ఈ సందర్భంగా కోహ్లీసేనను ఉద్దేశించి మంజ్రేకర్ వరుస ట్వీట్లు చేశాడు.
"ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండింయా ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ను తలపిస్తోంది. ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో పాక్ జట్టు ఓడిపోయే పరిస్థితుల నుంచి విజయాలు సాధించడానికి అనేక విధానాలు కనుగొనేది. ఆత్మవిశ్వాసంతోనే అది సాధ్యమయ్యేది."
-సంజయ్ మంజ్రేకర్, టీమిండియా మాజీ క్రికెటర్
ఈ ట్వీట్‌పై పాక్ నెటిజన్లు మంజ్రేకర్ నిజమే చెప్పాడని అంటుండగా భారత అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. టీమిండియాను.. వెస్టిండీస్ లేదా ఆస్ట్రేలియా జట్లతో పోల్చి ఉంటే బాగుండేదని, ఆ రెండు జట్లు ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్ర వేశాయని తెలిపారు.
కివీస్‌తో జరిగిన పొట్టి సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్‌ను మంజ్రేకర్ ప్రశంసించాడు. రాహుల్ అటు బ్యాట్స్‌మన్‌గా ఇటు కీపర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడని చెప్పాడు. ఈ సందర్భంగా యువ క్రికెటర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లను కూడా మంజ్రేకర్ పొగడ్తలతో ముంచెత్తాడు. వాళిద్దర్లో మంచి నైపుణ్యం దాగుందని, భవిష్యత్‌లో చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ అవుతారన్నాడు. వారికి కావాల్సిందల్లా కోహ్లీ బ్యాటింగ్ నుంచి కాసింత డోస్ తీసుకోవాలని సూచించాడు.
ఇవీ చూడండి.. మరోసారి టీమిండియా ఆటగాళ్ల ఫీజులో కోత