న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది టీమిండియా. అయితే చివరి మ్యాచ్ అనంతరం బారత్‌కు మరోసారి షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌కు జరిమానా విధించింది. ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే కారణంతో నాలుగో టీ20లోనూ 40 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.
"భారత జట్టు నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్‌కు సారథిగా ఉన్న రోహిత్ శర్మ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన
కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేసింది భారత్. సమష్టిగా రాణించిన కోహ్లీసేన.. వన్డే, టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. తొలి వన్డే హామిల్టన్‌లో ఈ బుధవారం జరగనుంది.
ఇవీ చూడండి.. కివీస్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం