ETV Bharat / sports

'కోహ్లీ నుంచి అన్నీ తీసేసుకుంటా' - విరాట్​ కోహ్లీ లేటెస్ట్​ న్యూస్​

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసుకోవాలనుందని అన్నాడు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​. అతడు బంతిని హిట్​ చేసే విధానం అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు.

Kane Williamson Wants to Play like Virat Kohli
కోహ్లీలా ఆడాలని ఉంది: విలియమ్సన్​
author img

By

Published : May 26, 2020, 7:41 AM IST

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు భారత సారథి విరాట్‌ కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానం. తాము మంచి స్నేహితులమని.. అభిరుచులు, ఆలోచనలూ ఒకటేనని గతంలో చెప్పాడు కేన్‌. అయితే విరాట్‌ నుంచి ఓ నైపుణ్యాన్ని తీసుకునే అవకాశం వస్తే ఏది ఎంచుకుంటారని అడగ్గా.. కోహ్లీ నుంచి అన్ని నైపుణ్యాలను తీసేసుకుంటానని నవ్వుతూ చెప్పాడు విలియమ్సన్‌.

"కోహ్లీ బంతిని హిట్‌ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అతని నైపుణ్యాలన్నింటినీ అప్పు తీసుకోవాలని అనిపిస్తుంది. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ కవర్‌డ్రైవ్‌, స్టీవ్‌ స్మిత్‌ బంతిని ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి పంపే విధానాన్ని, వార్నర్‌ బ్యాక్‌ ఫుట్‌ పంచ్‌లను సొంతం చేసుకోవాలని ఉంది" అని విలియమ్సన్​ చెప్పాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.