ETV Bharat / sports

'వరుస టీ20 ప్రపంచకప్​లతో ఆసక్తి తగ్గిపోతుంది!' - టీ20 ప్రపంచకప్​పై రోహిత్​ స్పందన్

ప్రతిఏటా టీ20 ప్రపంచకప్​ నిర్వహించడం వల్ల.. టోర్నీపై ఉన్న ఆసక్తి ప్రజల్లో తగ్గిపోతుందని టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్​కెప్టెన్​ రోహిత్​శర్మ అన్నాడు. ప్రతి ప్రపంచకప్​ నిర్వహణకు తగినంత సమయం ఉంటే ప్రేక్షకుల్లో ఆత్రుత పెరుగుతుందని చెప్పాడు.

It's for ICC to decide, there can't be too many World Cups: Rohit Sharma
'వరుస టీ20 ప్రపంచకప్​లతో ఆసక్తి తగ్గిపోతుంది!'
author img

By

Published : Mar 10, 2021, 8:57 PM IST

టీ20 ప్రపంచకప్​లను వరుసగా నిర్వహించడం వల్ల ప్రేక్షకుల్లో వాటిపై ఉన్న ఆసక్తి తగ్గిపోతుందని టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్​కెప్టెన్​ రోహిత్​శర్మ అన్నాడు. ప్రతి ప్రపంచకప్​నకు మధ్య కనీస కాలవ్యవధి​ ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే ఇలా వరుస టోర్నీల్లో ఆడేందుకు తమకు తగిన సమయం కూడా లేదని హిట్​మ్యాన్​ వెల్లడించాడు.

"ప్రపంచకప్​ ఆడకపోతే కచ్చితంగా దాన్ని మిస్​ అయినట్టే ఉంటుంది. అయితే ఇటీవలే 2019లో వన్డే ప్రపంచకప్​ ఆడాం. ప్రపంచకప్​లను అధికంగా నిర్వహించడం సరైనది కాదని భావించిన ఐసీసీ.. 2016-2021 మధ్య వన్డే ప్రపంచకప్​ తప్ప మరొక టోర్నీని నిర్వహించలేదు. అలాంటి పరిస్థితుల్లో వరల్డ్​కప్​ కోసం అభిమానుల ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచకప్​లను విరామం లేకుండా నిర్వహించడం వల్ల ఆ టోర్నీలపై ప్రేక్షకులలో ఉన్న ఆసక్తి తగ్గిపోవచ్చు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరగనుంది కాబట్టి టోర్నీ కోసం మేమెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అంతకంటే ముందు మేమిక్కడ చేయాల్సిన పని చాలా ఉంది".

- రోహిత్​ శర్మ, టీమ్ఇండియా వైస్​కెప్టెన్​

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో ఘనవిజయం సాధించిన టీమ్ఇండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్​లోని సౌథాంప్టన్ వేదికగా​ జూన్​ 18 నుంచి 22 వరకు జరగనున్న టెస్టులో న్యూజిలాండ్​తో కోహ్లీసేన తలపడనుంది.

అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్​ మధ్య మార్చి 12 నుంచి టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​లో పట్టు సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి.

ఇదీ చూడండి: ఐసీసీ ర్యాంకింగ్స్​: టీ20ల్లో రెండోస్థానానికి కోహ్లీసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.