ETV Bharat / sports

'ఐపీఎల్​కు ఆ ప్రదేశమైతే అనుకూలం'

author img

By

Published : Jun 14, 2020, 7:03 AM IST

కరోనా వల్ల వేసవిలో ఐపీఎల్‌ వినోదాన్ని కోల్పోయారు క్రికెట్‌ ప్రేమికులు. రాబోయే రెండు మూడు నెలల్లోనూ లీగ్‌ నిర్వహణ జరిగేలా కనిపించడం లేదు. మరి ఐపీఎల్ ఎప్పుడు జరపొచ్చు? ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ఈ అంశాలపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రత్యేక విశ్లేషణ.

sunil gawaskar
సునీల్​ గావస్కర్​

కరోనా వల్ల ఇప్పటిలో ఐపీఎల్​ నిర్వహణ కనిపించే అవకాశం లేదు. అయితే ఈ లీగ్​ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించాలి ?అనే అంశంపై టీమిండియా మాజీ సారథి సునీల్​ గావస్కర్​ మాట్లాడాడు.

జులై నుంచి స్టేడియాల్లోకి 10 వేల మందిని అనుమతిస్తూ మ్యాచ్‌లు జరుపుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో అక్టోబరులో ఆ దేశంలో యధావిధిగా టీ20 ప్రపంచకప్‌ నిర్వహించడానికి అవకాశాలు మెరుగైనట్లే. ముందు తమ దేశ అభిమానులతో అంతా సౌకర్యంగా అనిపిస్తే.. తర్వాత విదేశీయుల్ని కూడా అనుమతించవచ్చు.

అయితే టోర్నీలో ఆతిథ్య జట్టు సహా 16 జట్లు పాల్గొనాలి. వీటిలో ఆస్ట్రేలియా పొరుగున ఉన్న న్యూజిలాండ్‌ మాత్రమే కరోనా లేని దేశంగా నిలిచింది. మిగతా జట్లు టోర్నీ జరిగే నాటికి కరోనా ప్రభావం నుంచి బయటపడతాయా అన్నది సందేహమే. ప్రతి జట్టూ సహాయ సిబ్బందితో కలిపి కనీసం 40 మందితో ఆస్ట్రేలియాలో అడుగు పెడుతుంది. వీళ్లందరిపైనా దృష్టిసారించడం ఆ దేశ వైద్య వర్గాలకు కష్టమే. టీ20 ప్రపంచకప్‌ జరిగే సమయానికి ఎవరెవరిని అనుమతించాలనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన రావడానికి ముందు సెప్టెంబరు- అక్టోబరు మధ్య ఐపీఎల్‌ నిర్వహించే ప్రణాళికల్లో ఉన్న బీసీసీఐ ఇక వాటిని మార్చుకోక తప్పేట్లు లేదు. నా దృష్టిలో సెప్టెంబరులో యూఏఈ వేదికగా ఐపీఎల్‌ జరిపించడం మంచిది. అక్కడ వర్షాల బెడద ఉండదు. అలాగే స్టేడియాల మధ్య దూరం చాలా తక్కువ. ప్రపంచ స్థాయి హోటళ్లు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య పరంగా రక్షణ ఏర్పాట్లకు ఢోకా ఉండదు. అయితే అక్కడి వేడి వాతావరణంలో రోజుకు రెండు మ్యాచ్‌లంటే కష్టం. కాబట్టి లీగ్‌ను కుదించక తప్పదు.

ప్రతి జట్టూ మరో జట్టుతో ఒకసారి తలపడితే సరిపోతుంది. భారత్‌కు, యూఏఈకి మధ్య కాలంలో 90 నిమిషాలే తేడా కాబట్టి ప్రసారదారుకు కూడా ఇబ్బందుండదు. 2014లో కొన్ని మ్యాచ్‌ల తరహాలోనే ఇప్పుడు లీగ్‌ను యూఏఈ విజయవంతంగా నిర్వహించగలదు. ఐపీఎల్‌ మిగతా టోర్నీల్లాంటిది కాదు. అందులో భారీగా ఆదాయం ఉంది. వివిధ దేశాల ఆటగాళ్లు అందులో ఆడతారు. వారి బోర్డులకూ అందులో భాగముంది. కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన జనాలకు ఐపీఎల్‌ ఉపశమనాన్నందిస్తుంది.

ipl
ఐపీఎల్​

ఇది చూడండి : ఐదుగురు భారత క్రికెటర్లకు నాడా నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.