న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్ ఆకట్టుకున్నారు. కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టడం వల్ల, నిర్ణీత ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది టీమిండియా.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కోహ్లీసేనకు ఆరంభం ఆశించినంతగా దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(1), కెప్టెన్ కోహ్లీ(9) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కుదురుకుంటున్న మరో ఓపెరన్ పృథ్వీషా.. 40 పరుగులే చేసి వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న రాహుల్-శ్రేయస్ జోడీ.. భారత్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే అయ్యర్ అర్ధసెంచరీ చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 62 పరుగుల చేసిన శ్రేయస్.. నీషమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రాహుల్. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేశాడు. కొద్దిసేపటి తర్వాత 112 పరుగుల వద్ద రాహుల్, ఆ వెంటనే 42 పరుగుల వద్ద మనీశ్.. బెన్నెట్ బౌలింగ్ ఔటయ్యారు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో శార్దుల్ 7, జడేజా 8, సైనీ 8 పరుగులు చేశారు.