ప్రస్తుతం క్రికెట్లో అంచనాల్ని మించి రాణిస్తున్న జట్లలో అఫ్గానిస్థాన్ ఒకటి. అందులోని రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, షెజాద్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే పేరు సంపాదించుకున్నారు. తాజాగా ప్రపంచకప్లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
గుల్బాదీన్ నైబ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న రషీద్ ఖాన్, నబీ.. జట్టులో చోటు నిలబెట్టుకున్నారు. పేసర్ హమీద్ హానస్ మూడేళ్ల తర్వాత స్థానం సంపాదించాడు.
"ప్రపంచకప్ కోసం గత ఆరు నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాం. పెద్ద పెద్ద జట్లు పాల్గొంటున్న ఆ టోర్నీలో మా స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శిస్తాం. రాబోతున్న ప్రాక్టీసు మ్యాచ్ల్లో మా సత్తా చూపిస్తాం" -దవలత్ ఖాన్ అహ్మద్జై, ఆఫ్గానిస్థాన్ చీఫ్ సెలక్టర్
జట్టు...
గుల్బాదీన్ నైబ్(కెప్టెన్), మహమ్మద్ షెజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రన్, హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, అస్గర్ అఫ్గాన్, షాహిది, నజీబుల్లా జద్రన్, షిన్వారీ, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, దవలత్ జద్రన్, అఫ్తాబ్ ఆలమ్, హమీద్ హాసన్, ముజీబర్ రెహ్మాన్
రిజర్వ్ ఆటగాళ్లు: ఇక్రమ్ అలికిల్, కరీం జనత్, సయ్యద్ సిర్జాద్
ఇవీ చదవండి: