ETV Bharat / sports

రిక్షా ఎక్కేందుకైనా డబ్బులు ఉండేవి కావు : రహానె - Ajinkya Rahane struggles

చిన్నతనంలో ఎదురైన అనుభవాల్ని, తన కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు భారత క్రికెటర్ అజింక్య రహానె. చిన్నతనంలో క్రికెట్ ట్రైనింగ్​ తీసుకునేటప్పుడు కనీసం రిక్షా ఎక్కేందుకైనా డబ్బులు ఉండేవి కావన్నాడు.

రిక్షా ఎక్కేందుకైనా డబ్లులు ఉండేవి కావు: రహానె
క్రికెటర్ అంజిక్య రహానె
author img

By

Published : Mar 1, 2020, 5:30 AM IST

Updated : Mar 3, 2020, 12:47 AM IST

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానె అద్భుతమైన బ్యాట్స్​మన్​ అని అందరికి తెలుసు. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో అంతగా రాణించకపోయినా, టెస్టుల్లో మాత్రం ఆకట్టుకునే ప్రదర్శనలు చేశాడు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తనకోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగాలా చేశారో చెప్పుకొచ్చాడు.

"నా క్రికెట్ జర్నీ డొంబ్విల్లీలో ప్రారంభమైంది. నాకిప్పటికీ గుర్తు.. నేను శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాతో పాటు అమ్మ వచ్చేది. నా కిట్​ను ఓ చేత్తో, తమ్ముడ్ని మరో భుజంపై మోసేది. అలా రోజూ ఒకవైపు దాదాపు 6-8 కిలోమీటర్లు నడిచేవాళ్లం. ఆ సమయంలో రిక్షా ఎక్కేందుకు డబ్బులైనా ఉండేవి కావు. రిక్షా ఎక్కొచ్చు కదమ్మా అని అప్పుడప్పుడు అడిగేవాడిని.. కానీ అమ్మ మౌనంగానే ఉండేది. నేను అడగడం వల్లే వారానికొకసారి రిక్షా ఎక్కేవాళ్లం" -అజింక్య రహానె, భారత క్రికెటర్

Ajinkya Rahane
భారత క్రికెటర్ అజింక్య రహానె

"ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులే. వారికి నేను ఎప్పటికీ అంజిక్య రహానెనే. వారు నా కోసం చాలా త్యాగాలు చేశారు. వారు కోసం ఏదో ఒకటి చేయాలనేది నా కల. ఏడేళ్ల వయసులో మొదటిసారి రైలు ప్రయాణం చేశాను. నాతో పాటు వచ్చిన నాన్న సీఎస్​టీ ముంబయి స్టేషన్​లో దిగి శిక్షణ శిబిరం దగ్గరకు పట్టుకెళ్లి, పనికి వెళ్లిపోయారు. రెండో రోజు మాత్రం నేను ఒంటరిగానే వెళ్లాలని చెప్పారు. అయితే నేను ఎక్కిన ట్రైన్​లోనే వేరో బోగీలో ఉన్నారు. ఒక్కడినే వెళ్లగలనా లేదా అని నన్ను అనుసరించారు. కొన్నిరోజులకు నాపై నమ్మకం వచ్చిన తర్వాత ఒంటరిగా వదిలేశారు. నన్ను ప్రాక్టీస్​కు పట్టుకెళ్లేవారు.. కానీ నా ప్రదర్శన కోసం అసలు అడిగేవారు కాదు" -అజింక్య రహానె, భారత క్రికెటర్

2011లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రహానె. ఇప్పటివరకు 64 టెస్టులు ఆడాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్​లో భారత జట్టుకు ఉప సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

kohli with rahane
కెప్టెన్ కోహ్లీతో ఉప సారథి రహానె
Last Updated : Mar 3, 2020, 12:47 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.