టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మతో కలిసి లాక్డౌన్ సమయంలో సరదాగా గడుపుతున్నాడు. వీరిద్దరూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులను తరచూ పలకరిస్తున్నారు. అయితే తాజాగా అనుష్క ఓ ఫన్నీ వీడియోను నెట్టింట షేర్ చేసింది.
లాక్డౌన్ కారణంగా క్రికెట్ సిరీస్లు రద్దయ్యాయి. ఈ కారణంగా కోహ్లీ మైదానాన్ని మిస్ అవుతున్నాడు. ముఖ్యంగా మైదానంలో విరాట్ బ్యాటింగ్ చేస్తున్నపుడు అభిమానులు చేసే గోలకు మరింతగా దూరమవుతున్నాడు. అయితే ఈ విషయమై అనుష్క.. కోహ్లీని ఆటపట్టిస్తూ కనిపించింది. ఓ అభిమానిలాగా అరుస్తూ "ఫోర్ కొట్టు కోహ్లీ" అంటూ చమత్కరించింది. దీనికి విరాట్ నో అంటూ తల ఊపడం నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">