ETV Bharat / sports

బౌలింగ్ మాంత్రికుడికే స్పిన్ పాఠాలు.. చివరకు...

తన స్పిన్​ బౌలింగ్​తో టెస్టు​ల్లో 700 వికెట్లకు పైగా తీసిన ఆసీస్​ దిగ్గజ బౌలర్​ షేన్​ వార్న్​కు అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. 'ముందు స్పిన్​ గురించి తెలుసుకో' అంటూ వార్న్​కు ట్విట్టర్​లో సూచించాడు అతడు.

shane warne, virendra sehwag
షేన్ వార్న్, వీరేంద్ర సెహ్వాగ్
author img

By

Published : Jun 20, 2021, 5:17 PM IST

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్​ వార్న్​కు ఓ అభిమాని నుంచి వింత అనుభవం ఎదురైంది. బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టిన ఈ బౌలింగ్ మాంత్రికుడికి.. 'స్పిన్​ను అర్థం చేసుకో' అని సూచించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సౌథాంప్టన్​ వేదికగా ఇండియా-కివీస్​ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ మ్యాచ్​లో తొలుత స్పిన్నర్​కు తుది జట్టులో అవకాశమిచ్చింది న్యూజిలాండ్​. వర్షం కారణంగా తొలి రోజు ఆట జరగలేదు. కనీసం టాస్ కూడా పడలేదు. వాతవరణం మబ్బులు పట్టి ఉండడం వల్ల.. ఉన్నా స్పెషలిస్ట్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​ను పక్కన పెట్టి.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది కేన్ సేన. దీనిపై ఆసీస్​ మాజీ.. ట్విట్టర్​ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. వికెట్​ స్పిన్​కు అనుకూలిస్తుందని.. స్పిన్నర్​ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అసంతృప్తికి గురి చేసిందని తెలిపాడు.

వార్న్​ అభిప్రాయంతో అంగీకరించలేదు ఓ అభిమాని. ఆటపై వార్న్​కున్న జ్ఞానం పట్ల సందేహాలు వ్యక్తం చేశాడు. "షేన్, అసలు స్పిన్​ ఎలా పనిచేస్తుందో తెలుసా? పిచ్​ పొడిగా ఉంటే బంతి తిరుగుతుంది. కానీ, ఇక్కడ అలా లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్​ మొత్తానికి వర్ష సూచన ఉంది" అని ఆ అభిమాని ట్వీట్ చేశాడు.

  • Bruh😭😭😭😭😭
    You asking this guy on how spin works!😭😭😭😭 pic.twitter.com/vQgLxgDhlr

    — Devaram🇳🇿/Die hard Kiwi fan (@Goatendradhoni) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సదరు అభిమాని ట్వీట్ మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​తో పాటు చాలా మందిని ఆకర్షించింది. అతడు చెప్పింది కూడా సరైన విషయమే అంటూ సరదాగా బదులిచ్చారు. వార్న్​కే స్పిన్ పాఠాలు అంటూ నవ్వుతున్న ఎమోజీని జోడించారు. చివరకు ఆ నెటిజన్ తన ట్వీట్​ను డిలీట్ చేశాడు.

ఇదీ చదవండి: సచిన్​ నయా రికార్డ్​- ఈ శతాబ్దంలోనే టాపర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.