Chetansharma praises Kl Rahul: దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం.. కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ. ఇప్పటికే అతడు తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడని, అందుకే వన్డే సిరీస్ కోసం సారథిగా అతడిని నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ను కెప్టెన్‌గా ప్రకటించారు.
"కేఎల్ రాహుల్‌ను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం అన్ని ఫార్మట్లలో అతడు బాగా ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అతడికి మంచి అనుభవం ఉంది. ఇప్పటికే అతడు తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు. అందుకే సెలెక్టర్లు అతడిని ఎంచుకున్నారు. కెప్టెన్సీ అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు అతడు సారథిగా వ్యవహరించి అనుభవాన్ని సంపాదించుకున్నాడు. రోహిత్ ఫిట్‌గా లేనందున జట్టును నడిపించగల సత్తా అతడికే ఉందని మేము నమ్ముతున్నాం. అందుకే అతడిని భవిష్యత్ కెప్టెన్‌గా సిద్ధం చేస్తున్నాం."
-చేతన్‌శర్మ.
ఇక ఈ సిరీస్‌కు ఎంపికైన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై ప్రశంసలు కురిపించారు చేతన్. జట్టులో అతడు అద్భుతాలు చేస్తాడని కితాబిచ్చారు.
"సరైన సమయంలో అతడికి మంచి అవకాశం వచ్చింది. టీ20 జట్టులో అతడు ఇప్పటికే ఉన్నాడు. ఇప్పుడు వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు. జట్టు కోసం అతడు అద్భతాలు చేస్తాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో అతడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు" అని చేతన్ అన్నారు.
రుతురాజ్.. ఐపీఎల్, ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ విజయ్ హజారే టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 603 పరుగులు చేశాడు.
ఇదీ చూడండి: కోహ్లీ ఆడే ఆ షాట్.. ఒకప్పడు ప్లస్.. ఇప్పడదే మైనస్