ETV Bharat / health

చట్నీలను ఫ్రిజ్​లో పెట్టి తింటున్నారా? నాన్​వెజ్ పెట్టినా కూడా బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్! - HOW TO STORE FOOD IN FRIDGE

-ఫ్రిజ్​లో కూడా బ్యాక్టీరియా పెరుగుతుందా? -ఆహారం పెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Rules for Storing Food Safely in a Fridge
Rules for Storing Food Safely in a Fridge (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 28, 2024, 3:31 PM IST

Rules for Storing Food Safely in a Fridge: సామాన్యంగా ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్​ను వాడుతుంటారు. అయితే, మనలో చాలా మంది.. వండినవి, వండనివి, పచ్చివి అన్ని ఒకే దగ్గర పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పచ్చి పదార్థాల్లో ఉన్న బ్యాక్టీరియా.. వండిన పదార్థాల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొందరు ఫ్రిజ్​లో బ్యాక్టీరియా ఉండదు అనుకుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పెరుగుతుందని ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత వివరిస్తున్నారు. ఫ్రిజ్​ను 4 డిగ్రీల లోపు పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియాను కొద్దిగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే, కొన్ని బ్యాక్టీరియాలు చలిలో, రిఫ్రిజరేటర్​​లో సైతం పెరుగుతాయని వివరిస్తున్నారు. అయితే, వీటిని అదుపులో పెట్టుకునేందుకు ఫ్రిజ్​ను ఎప్పటికప్పడూ శుభ్రం చేస్తుండాలని అంటున్నారు. ఇందుకోసం యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్స్ ఉపయోగించాలని వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా నాన్​వెజ్ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా నిల్వ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, పచ్చి మాంసాన్ని ఫ్రిజ్​లో పెట్టడం వల్ల అందులోని బ్యాక్టీరియా.. వండిన పదార్థాలపైకి వ్యాపిస్తుందని అంటున్నారు. అందుకోసమే నాన్​వెజ్ పదార్థాలను చక్కగా ప్యాక్ చేసి కింది ర్యాకుల్లో పెట్టాలని సూచిస్తున్నారు. కూరగాయలను కూడా శుభ్రం చేసి జిప్ కవర్లలో భద్రపరచుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఇంకా మనలో చాలా మంది.. కొన్ని రోజుల పాటు ఫ్రిజ్​లో పెట్టిన తర్వాత తింటుంటారు. అయితే, ఇలా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పాల సంబంధిత పదార్థాలను ముఖ్యంగా పన్నీర్​లను జాగ్రత్తగా పెట్టాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలను ప్రత్యేకమైన కవర్లలో పెట్టడం వల్ల ఇన్​ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా వండిన ఆహారాన్ని ఫ్రిజ్​లో పెట్టేటప్పుడు క్లోజ్ కంటైనర్ల్లో పెట్టాలని సలహా ఇస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయాన్ని టిఫిన్స్ చేసేందుకు వీలుగా.. కొబ్బరి, పల్లీ చట్నీలు, ఇడ్లీ, దోశ పిండి లాంటివాటిని 2-3 రోజుల పాటు ఫ్రిజ్​లో పెట్టి తింటుంటారు. అయితే, ఇలాంటి సమయంలో కరెంట్ పోతే.. ఫ్రిజ్​లోని ఉష్ణోగ్రత పెరిగి పదార్థాల్లో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఇలా కరెంట్ పోయిన సమయంలో ఫ్రిజ్​లో ఐస్​క్రీము ఉంటే అందులో కూడా బ్యాక్టీరియా పెరిగిపోతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్​ప్లాంట్స్ అయిన రోగులు ఫ్రిజ్​ సంబంధింత పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్ని సాధ్యమైనంతవరకు తాజాగా, పరిశుభ్రంగా, అప్పటికప్పుడు వండుకొని, వేడివేడిగా తీసుకోవడమే మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. అందుకోసమే వీలైనంతవరకు మిగిలిపోయిన అన్ని పదార్థాలనీ ఫ్రిజ్​లో పెట్టకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లలకు తినేటప్పుడు ఫోన్లు ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

దగ్గుతో నిద్ర కూడా పట్టట్లేదా? ఈ స్వీట్ మందు తీసుకుంటే తగ్గే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.