ETV Bharat / offbeat

ఈ స్టైల్​లో "మటన్ దమ్ బిర్యానీ" చేయండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారంతే! - MUTTON BIRYANI WITH CHITTI MUTHYALU

ఎప్పుడూ రెగ్యులర్ బిర్యానీలే కాదు - ఓసారి "చిట్టిముత్యాల మటన్ దమ్ బిర్యానీ" ట్రై చేయండిలా!

How to Make Mutton Biryani
Mutton Dum Biryani Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 15 hours ago

Mutton Dum Biryani Recipe in Telugu : వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో నాన్​వెజ్, బిర్యానీ వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. అయితే, మీరు ఇప్పటివరకు వివిధ రకాలుగా బిర్యానీలు తయారు చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఈ స్టైల్​లో ట్రై చేశారా? అదే, "చిట్టి ముత్యాలతో అద్దిరిపోయే మటన్ దమ్ బిర్యానీ". దీని తయారీకి హైదరాబాదీ దమ్ బిర్యానీకి కావాల్సినన్ని పదార్థాలు, సమయం అవసరం లేదు! చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్​తో ఎవరైనా ఈజీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు. టేస్ట్​ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చిట్టి ముత్యాల బియ్యం - రెండున్నర కప్పులు(1 కప్పు = 195గ్రాములు)
  • మటన్ - అరకిలో
  • నూనె - ముప్పావు కప్పు
  • నెయ్యి - పావు కప్పు
  • దాల్చిన చెక్క - 3 అంగుళాలు
  • అనాస పువ్వులు - 2
  • యాలకులు - 7
  • లవంగాలు - 12
  • షాజీరా - 1 టేబుల్​స్పూన్
  • బిర్యానీ ఆకులు - 4
  • స్టోన్ ఫ్లవర్ - 1
  • జీడి పప్పు పలుకులు - పావు కప్పు
  • ఉల్లిపాయలు - 2(పెద్ద సైజ్​వి)
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • టమాటాలు - 2
  • కొత్తిమీర తరుగు - పిడికెడు
  • పుదీనా తరుగు - పిడికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టేబుల్​స్పూన్
  • ధనియాల పొడి - 1 టేబుల్​స్పూన్
  • కారం - రుచికి తగినంత
  • గరంమసాలా - 1 టేబుల్​స్పూన్
  • పెరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి - 3

మటన్​ త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి - ఎంత ముదిరినా చక్కగా ఉడికిపోద్ది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చిట్టిముత్యాల బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. అలాగే మటన్​ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చిని కట్​ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై అడుగు మందంగా ఉండే బిర్యానీ గిన్నె పెట్టి నూనె, నెయ్యి వేసుకోవాలి. ఆ మిశ్రమం వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, అనాస పువ్వులు, యాలకులు, షాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకులు, రాతి పువ్వు వేసి కాసేపు వేయించుకోవాలి.
  • అవి వేగాక జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు వేసి అవి కాస్త మెత్తబడే వరకు వేపుకోవాలి.
  • ఉల్లిపాయలు వేగి కాస్త పింక్​ కలర్​లోకి మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలిపి కాసేపు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్​ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలా మిక్స్​ చేసుకోవాలి.
  • ఆపై స్టౌను హై ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో కలుపుతూ మటన్ ముక్కలపై కాలినట్టు ఎర్రటి మచ్చలు ఏర్పడే వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు, ఉప్పు వేసి కలిపి కాసేపు వేయించాలి. ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, కారం వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై పెరుగు వేసి కలిపి మూతపెట్టి మిశ్రమంలో ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్​, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలిపి బియ్యంలోని చెమ్మ ఆరిపోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత 5 కప్పుల వేడి నీరు పోసి మిక్స్​ చేసుకోవాలి. ఈ టైమ్​లోనే బిర్యానీలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్​ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవాలి.

"ఫిష్​ ఫ్రై బిర్యానీ" ఎప్పుడైనా ట్రై చేశారా? - ఈ టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!

  • అనంతరం దమ్ చేయడానికి గిన్నెపై మూతపెట్టి దానిపై అల్యూమినియం ఫాయిల్​ ఉంచాలి. ఆపై దాని మీద ఎర్రటి బొగ్గులు లేదా కొబ్బరి పెంకులు వేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఇవి లేకపోతే మామూలుగా బిర్యానీని దమ్ చేసుకోవచ్చు.
  • బొగ్గుల మీద దమ్​ చేసుకునే వారైతే 8 నిమిషాలు హై ఫ్లేమ్​లో, 6 నిమిషాలు లో ఫ్లేమ్​లో దమ్​ చేసుకుని స్టౌ ఆఫ్​ చేసి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • అదే మామూలుగా దమ్​ చేసుకునేవారైతే 12 నిమిషాలు హై ఫ్లేమ్​లో, 10 నిమిషాలు లోఫ్లేమ్​లో దమ్ చేసుకుని స్టౌ ఆఫ్​ చేసి అరగంట పాటు అలా ఉండనివ్వాలి.
  • అరగంట తర్వాత మూత తీసి బిర్యానీలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలిపి 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే ఘుమఘుమలాడే "చిట్టిముత్యాల మటన్ దమ్​ బిర్యానీ" రెడీ!

బ్యాచిలర్స్ రెసిపీ "చికెన్ టిక్కా బిర్యానీ" - వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.