ETV Bharat / sports

బంగ్లాతో టెస్ట్​ సిరీస్‌.. రోహిత్​ ఔట్​.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాలో స్పల్ప మార్పులు జరిగాయి. గాయం కారణంగా రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ ఆడనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

changes in team india for bangladesh test series

author img

By

Published : Dec 11, 2022, 7:46 PM IST

Updated : Dec 11, 2022, 8:23 PM IST

India Bangladesh Test Series: బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య డిసెంబర్‌ 14 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది.

మొదటి టెస్టు కోసం రోహిత్‌ స్థానంలో ఇండియా- ఎ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ జట్టులోకి రానున్నాడు. భుజం గాయం నుంచి మహ్మద్‌ షమీ, మెకాలి గాయం నుంచి రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో నవదీప్‌ సైనీ, సౌరభ్‌ కుమార్‌లను జట్టులోకి ఎంపిక చేశారు. కెరీర్‌లో ఏకైక టెస్టు (2010లో సౌతాఫ్రికా) ఆడిన ఫాస్ట్‌బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌కు కూడా ఈ సిరీస్‌కు కోసం సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.

మార్పుల అనంతరం భారత జట్టు ఇదే..
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్‌ పూజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, నవ్‌దీప్‌ సైని, సౌరభ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.

Last Updated : Dec 11, 2022, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.