Asia cup 2023 : ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023 టోర్నీకి సర్వం సిద్ధమైంది. మరో 14 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనున్న తరుణంలో క్రికెట్ లవర్స్‌కు ఈ గేమ్ పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో సత్తా చాటేందుకు ఆసియా క్రికెట్ టీమ్స్ తమదైన శైలిలో కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఆసియా కప్‌లో ఆసక్తికరంగా సాగనున్న నాలుగు మ్యాచ్లేంటో చూద్దాం..
భారత్- పాకిస్థాన్ మ్యాచ్ : క్రికెట్ లవర్స్‌కు ఏదైనా ఉత్కంఠగా అనిపిస్తుందంటే అది భారత్-పాకిస్థాన్ మ్యాచే. ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టెజ్ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటుంది. మెల్‌బోర్న్ మైదానం వేదికగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో జరిగిన భారత్-పాక్ పోరు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌గా రికార్డుకెక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆట తీరు అందది మనసులు గెలుచుకుంది.
ఇప్పుడు ఈ ఆసియా కప్ వేదికగా జరగనున్న రైవల్స్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 2న చూడొచ్చు. అయితే ఒక వేళ అన్నీ సెట్ అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ దశలో, సూపర్- 4 దశతో పాటు ఫైనల్స్‌లో చేరితే టైటిల్ పోరులోనూ భారత్-పాక్ మధ్య పోరు జరిగే అవకాశం ఉండొచ్చు.
బంగ్లాదేశ్ - శ్రీలంక మ్యాచ్ : ఇక భారత్-పాక్ మ్యాచ్ తర్వాత అంతటి ఆసక్తి కలిగించే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్-శ్రీలంకదే. నిదహాస్ ట్రోఫీ నుంచి ఈ ఇరు జట్ల మధ్య జరిగే అన్నీ మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన ఆ ట్రై సిరీస్ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమిపాలైంది. దీంతో అప్పట్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగినీ డ్యాన్స్‌లు వేస్తూ నెట్టింట ట్రెండయ్యారు. దీంతో
ఇది ఇరు జట్ల మధ్య చిన్నపాటి వాగ్వాదానికి దారి తీసింది. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా స్లెడ్జింగ్, నాగినీ డ్యాన్స్‌లతో ఆటగాళ్లు చెలరేగిపోతుంటారు. ఇక ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 31న బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో ఇరు జట్లు మెరుగ్గా రాణిస్తే గ్రూప్-4, ఫైనల్లో కూడా వీరు తలపడే అవకాశాలు ఉంది.
శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్ : మరోవైపు ఆసియాకప్ 2023 టోర్నీ ఆతిథ్య దేశాలు అయిన శ్రీలంక, పాకిస్థాన్ మధ్య కూడా ఓ మ్యాచ్ ఉండనుంది. అయితే గతంలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ టోర్నీలో శ్రీలంకను తక్కువ అంచనా వేసిన పాక్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. దీంతో ఫైనల్స్‌లో లంక సూపర్ ఫీల్డింగ్‌కు చిత్తుగా ఓడి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది.
ఇక ఈ ఓటమితో శ్రీలంకపై పగ తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్.. ఈసారైనా వారిపై గెలవలన్న కసితో ఉంది. అయితే వేర్వేరు గ్రూప్‌ల్లో ఉన్న ఈ జట్లు సూపర్-4లో తలపడే అవకాశాలు ఉన్నాయి.
భారత్- శ్రీలంక మ్యాచ్ : భారత్, శ్రీలంక మధ్య జరగనున్న మ్యాచ్ కూడా ఆసక్తికరంగా ఉండనుంది. ఆసియాకప్ 2022 టోర్నీ సూపర్-4లో భారత్‌ను ఓడించిన శ్రీలంక జట్టు.. శరవేగంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో భారత్ జట్టు కూడా లంక టీమ్‌పై గెలుపొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే వేర్వేరు గ్రూప్స్‌లో ఉన్న కారణంగా ఇరు జట్లు సూపర్-4లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Asia Cup ODI Format : అప్పుడు టీ20.. ఇప్పుడు వన్డే.. ఆసియా కప్‌లో ఈ ఛేంజ్ ఏంటి ?
Asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్ షెడ్యూల్ రెడీ.. భారత్-పాక్ మ్యాచ్ వేదిక ఇదే!