Alastair Cook Retirement : ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మైంట్ ప్రకటించినప్పటికి.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు 38 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అలిస్టర్ కుక్ నిలిచాడు.
Alastair Cook Stats : అలిస్టర్ కుక్ ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 161 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 12,472 పరుగులు చేశాడు. అతడి సగటు 45.35 కాగా.. బెస్ట్ స్కోరు 294. కుక్ తన టెస్టు కెరీర్‌లో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక 92 వన్డే మ్యాచ్‌లు ఆడి 36.4 సగటుతో 3204 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో కూడా అలిస్టర్ కుక్ బాగా రాణించాడు. 352 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా.. 46.41 సగటుతో 26,643 పరుగులు చేశాడు. అందులో 74 సెంచరీలు, 125 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కుక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మొత్తం 386 క్యాచ్‌లు పట్టాడు. 2006లో నాగ్‌పుర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున కుక్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి.. దేశీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.
వరుసగా 159 టెస్టులు ఆడిన కుక్..
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ అలిస్టర్ కుక్ తన క్రికెట్ కెరీర్‌లో వరుసగా 159 టెస్టులాడి 24 ఏళ్లుగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పేరిట ఉన్న టెస్టు రికార్డును బద్దలు కొట్టాడు. అంతేగాక కుక్కు టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 9సార్లు ఔట్ చేశాడు.