ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటికే సింధు సెమీస్‌కు దూసుకెళ్లగా.. తాజాగా ఆ జాబితాలో సాయి ప్రణీత్ చేరాడు. క్వార్టర్స్‌లో ఇండోనేసియాకు చెందిన జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. ఈ గెలుపుతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 36 ఏళ్ల తర్వాత సెమీస్ చేరిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 24-22, 21-14 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు ప్రణీత్. ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతక గ్రహీతైన జొనాథన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగాడు. అయితే సాయిప్రణీత్ అతడి జోరుకు చెక్ పెట్టాడు.
ప్రకాశ్ పదుకుణే తర్వాత బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్ చేరిన షట్లర్‌గా ప్రణీత్ ఘనత సాధించాడు. 1983 టోర్నీలో ప్రకాశ్ పదుకుణే కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్షిప్: సెమీస్‌లోకి సింధు