తనకు తండ్రి ఉన్నా లేనట్టేనని.. ఇంతవరకూ కనీసం ఒక్క డ్రెస్ కూడా కొనిపెట్టలేదని బుల్లితెర నటి శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినప్పుడు తానుండే గేటెడ్ కమ్యూనిటీలోకి రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా కూడా ఎవరూ లేరని.. తన జీవితంలో అంతలా ఏడ్చిన సందర్భం ఇంకోటి లేదని మరోనటి నవ్యస్వామి ఆవేదనకు గురైంది.
ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బుల్లితెర నటులు శ్రీవాణి, నవ్యస్వామి పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. శ్రీవాణిని పెళ్లి గురించి అడగ్గా.. 'మా ఆయన అడగ్గానే సీరియల్‌ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాను. నేను వెళ్లిపోయిన తర్వాత నా స్థానంలో వేరే హీరోయిన్ పెట్టుకోకుండా సీరియల్ మొత్తాన్నే ఆపేశారు' అని శ్రీవాణి నవ్వుతూ బదులిచ్చింది. మధ్యలో తమ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని నవ్యస్వామి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">