రానా, సాయిపల్లవి నటించిన సినిమా 'విరాటపర్వం'. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే నిర్మాతలు.. దీనిని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించనున్నారు. సాయిపల్లవి కథానాయికగా చేస్తోంది. వేణు ఊడుగుల దర్శకుడు. సురేశ్‌బాబు నిర్మించారు. ఇప్పటికే వచ్చిన టీజర్, ఫొటోలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అయితే చిత్రాన్ని చూడాలనే ప్రేక్షకుల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో?
- " class="align-text-top noRightClick twitterSection" data="">