రౌడీహీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. పూరీ జగన్నాథ్ తీస్తున్న కొత్త సినిమాతో అక్కడ అడుగుపెడుతున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ నేడు(సోమవారం).. ముంబయిలో లాంఛనంగా మొదలైంది.
-
#VD10 #PJ37 movie launched in #Mumbai and also regular shoot from today.@TheDeverakonda @purijagan @Charmmeofficial @karanjohar@DharmaMovies @PuriConnects#VdPjShootBegins #PCFilm pic.twitter.com/RL6jymRRUr
— Puri Connects (@PuriConnects) January 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#VD10 #PJ37 movie launched in #Mumbai and also regular shoot from today.@TheDeverakonda @purijagan @Charmmeofficial @karanjohar@DharmaMovies @PuriConnects#VdPjShootBegins #PCFilm pic.twitter.com/RL6jymRRUr
— Puri Connects (@PuriConnects) January 20, 2020#VD10 #PJ37 movie launched in #Mumbai and also regular shoot from today.@TheDeverakonda @purijagan @Charmmeofficial @karanjohar@DharmaMovies @PuriConnects#VdPjShootBegins #PCFilm pic.twitter.com/RL6jymRRUr
— Puri Connects (@PuriConnects) January 20, 2020
ఈ సినిమాకు 'ఫైటర్' టైటిల్‌ను అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం విజయ్.. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. 'జై లవకుశ' ఫేమ్ రోనిత్ రాయ్ విలన్‌గా కనిపించనున్నాడు. హీరోయిన్గా అనన్య పాండే నటించబోతుంది.