టాలీవుడ్లో ప్రేమకథా చిత్రాలకు పెద్దపీట వేస్తారు. అందుకోసం యువతను ఆకట్టుకునే విధంగా సినిమాలను రూపొందిస్తారు. అలాంటప్పుడు ప్రేమికుల రోజంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా. అలాంటి ప్రయత్నమే చేశాయి చిత్రబృందాలు. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా పలు చిత్రాల్లోని సాంగ్స్, ట్రైలర్స్, విడుదల తేదీలతో పాటు కొత్త పోస్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.
ధనుష్ హీరోగా ఆర్.ఎస్ దురై సెంతిల్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లోకల్ బాయ్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. మెహరీన్ కథానాయిక. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

సుజోయ్, సుశీల్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రెషర్ కుక్కర్'. సాయి రోనాక్ హీరో. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ నెట్టింట విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ నెల 21న థియేటర్లలో సందడి చేయనుందీ మూవీ. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'ఓ పిట్ట కథ.' చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా లవర్స్ డే సందర్భంగా 'ఏమై పోతానే' పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పులి వాసు దర్శకత్వంలో మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి కథానాయిక. కాగా ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఫలక్నుమాదాస్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. మరోసారి 'హిట్' చిత్రంతో అలరించేందుకు వస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రోమో ఇటీవల విడుదలై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుందీ మూవీ.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా వస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకుడు. ఇటీవల ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా 'గ్లాన్స్ ఆఫ్ రొమాంటిక్' పేరుతో మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మే 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సుశాంత్ హీరోగా ఎస్ దర్శన్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. రవిశంకర్ శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లక్ష్ చదలవాడ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'వలయం'. దిగంగన సూర్యవన్షి కథానాయిక. రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పకులు. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని 'నిన్ను చూశాకే' పాటను విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వస్తోన్న సినిమా 'శశి'. రాశీ సింగ్, సురభి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా లవర్స్ డే సందర్భంగా మూవీకి సంబంధించిన సురభి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు.
