ETV Bharat / sitara

పసికందుల ప్రాణాలు కాపాడేందుకు సోనూ విమానం

39 మంది చిన్నారుల కోసం ఫిలిప్సీన్స్​ నుంచి దిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించి.. మంచిమనసు చాటుకున్నారు నటుడు సోనూసూద్. లాక్​డౌన్​లో ప్రభావంతో చిక్కుకుపోయిన చాలామంది వలస కూలీలను స్వస్థలాలకు చేర్చి, వాళ్లతో పాటు ప్రజల మనసుల్లో చోటు సంపాదించారు.

sonusudh
సోనూ సూద్​
author img

By

Published : Aug 14, 2020, 11:25 PM IST

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సమయంలో వేలమందికి సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ ఆంక్షలు దాదాపుగా సడలిపోయినా ఇప్పటికీ ఆయన నుంచి ఎవరో ఒకరు సాయం పొందుతూనే ఉన్నారు. ట్విట్టర్​‌ వేదికగా ఆయనకు అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం తన చేతనైనంత సాయం చేస్తున్నారు. తాజాగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరమైన 39మంది చిన్నారుల కోసం ఫిలిప్సీన్స్‌ నుంచి దిల్లీకి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.

sonusudh
సోనూ సూద్​

లివర్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 39 మంది చిన్నారులకు.. దిల్లీలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అయితే, వారంతా ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా సోనూసూద్‌కు విన్నవించగా.. "ఈ అమూల్యమైన జీవితాలను కాపాడుదాం. మరో రెండు రోజుల్లో వాళ్లు ఇండియాకు వస్తారు. 39 ఏంజెల్స్‌ మీరు మీ బ్యాగ్‌లు సర్దుకోండి" అని సోనూ సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు ఆయన సాయాన్ని ప్రశంసిస్తున్నారు.

  • Welcome to India 🇮🇳
    We will make all of them super fit.
    This will always remain one of the most special moments of my life.
    Get well soon little angels ❣️ https://t.co/RtiIJugvJr

    — sonu sood (@SonuSood) August 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదే కాదు.. వైద్యం అవసరమని ఒకరు, చదువుకోవడానికి యూపీఎస్‌ఈ పుస్తకాలు కావాలంటూ మరొకరు ట్వీట్‌ చేయగా.. వారికి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు సోనూ.

ఇది చూడండి న్యాయవిద్యార్థిని శస్త్రచికిత్సకు సోనూ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.