"సమాజంలో సెక్స్ ఒక భాగమే. ఈ విషయంపై మాట్లాడటం తప్పుకాదు" అంటూ సందేశాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'కాందానీ షఫాఖానా'. సోనాక్షి సిన్హా హీరోయిన్. శిల్పి దాస్... డైరెక్టర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పంజాబ్‌లోని ఒక చిన్న పట్టణంలో ఓ అమ్మాయి సెక్స్ క్లినిక్ ఎందుకు నడపాల్సి వచ్చింది, ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనే వినూత్న కథాంశంతో ఈ సినిమా తీశారు.
'భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధించారు. ఈ సమస్యపై మనమందరం పోరాడాలి.' - శిల్పి దాస్‌గుప్తా ,దర్శకుడు
'నేను ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నా. లైంగిక అవగాహన అనేది అందరూ చర్చించాల్సిన అంశం. ఆ విషయంపై మాట్లాడే ధైర్యం సమాజానికి ఈ చిత్రం ఇస్తుందని భావిస్తున్నా. ప్రజలను ఆలోచించేలా చేస్తుందని కచ్చితంగా నమ్ముతున్నా'. -సోనాక్షి సిన్హా, హీరోయిన్
"సోనాక్షి సిన్హా ధైర్యంగా ఈ సవాలు స్వీకరించింది. శృంగారాన్ని చెడ్డ విషయంగా చూడకుండా ఉండటానికి సమాజానికి సహాయం చేయగలమని మేము భావిస్తున్నాం" -శిల్పి దాస్ గుప్తా, దర్శకుడు
ఇది చదవండి: 'అమ్మాయిల చుట్టూ ఇక తిరగను...