ETV Bharat / sitara

'నా రెండో పెళ్లిపై అలా అన్నారు.. బాగా ఏడ్చాను' - సింగర్ సునీత వివాహం

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న గాయకురాలు సునీత. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల వ్యాపారవేత్త రామ్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన ఎత్తుపల్లాలను తాజా ఇంటర్వూలో పంచుకున్నారు.

singer Sunitha interview
భర్త రామ్​తో సునీత
author img

By

Published : Aug 11, 2021, 12:52 PM IST

తన మధురమైన స్వరంతో గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన తెలుగింటి ముద్దుగుమ్మ సునీత. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత.. కష్టాల్నే పునాదులుగా మలచుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇటీవల రామ్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

singer Sunitha husband
సింగర్​ సునీత

ఎన్నో సమస్యలు..

టీనేజీలో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి.. తన జీవితం ఓ అందమైన నవలలా ఉండాలని కలలుకంటుంది. తన కథలో తనే కథానాయిక కావాలని ఆశిస్తుంది. జీవిత భాగస్వామి తనని బాగా చూసుకోవాలని.. ప్రేమించాలని.. లాలించాలని.. ఊహల లోకంలో విహరిస్తుంటుంది. నా కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో నేను కూడా అలాంటి ప్రపంచంలోనే ఉన్నాను. కానీ, మొదటి పెళ్లి తర్వాత నాకెన్నో విషయాలు తెలిసొచ్చాయి. అసలు జీవితమంటే ఏమిటో తెలిసింది. మొదటి పెళ్లి, బ్రేకప్‌ తర్వాత రామ్‌తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. ఇంకెన్నో సమస్యలు చూశా. నాకు తగిలిన దెబ్బలకు మనుషుల్ని నమ్మడం కూడా మానేశా.

ఎన్నో అవమానాలు..

నేను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కి వెళ్లా. ప్రోగ్రామ్‌లో భాగంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇచ్చిన మైక్‌ని చేతితో అందుకున్నా. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆయన సతీమణి నా వద్దకు వచ్చి.. 'నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా?' అని ప్రశ్నించింది. నేను షాకై.. 'ఏమైంది ఆంటీ' అని అడగ్గా.. 'ఇందాక నువ్వు మైక్‌ తీసుకుంటూ ఆయన చేతిని తాకావు. ఆయనపై నీకున్న ఆలోచన ఏమిటి?' అని అన్నారు. ఆ మాటకు బాగా ఏడ్చా. ఇది ఒక్కటి మాత్రమే కాదు.. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో కామెంట్లు చూశా. ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా" అని సునీత వివరించారు.

singer Sunitha husband
భర్త రామ్​తో సునీత

ఆయనలోని నిజాయతీ నచ్చింది

రామ్‌ చాలా మంచి వ్యక్తి. పెళ్లి ప్రపోజల్‌తో నా వద్దకు వచ్చినప్పడు 'నువ్వు నా ప్రపోజల్‌ ఒప్పుకొంటే నా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే బాధపడతా.. కానీ నా లైఫ్‌ మాత్రం ఎక్కడా ఆగదు' అని చెప్పాడు. ఆయనలోని నిజాయతీ నాకు బాగా నచ్చింది"

"చాలా మంది ఆడవాళ్లు నా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. నా బాధ్యతలన్నీ ఎవరో వ్యక్తి చూసుకుంటున్నారని కామెంట్లు కూడా చేశారు. డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకున్నానన్నారు. ఆయనకు ఎంత ఆస్తి ఉందనే విషయం నాకు ఇప్పటికీ తెలియదు. ఆయన కంపెనీ టర్నోవర్‌ ఎంతో ఐడియా లేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఒకరిపై ఒకరికి పరస్పరం గౌరవం ఉంది" అని వెల్లడించారు సునీత.

ఇదీ చదవండి:మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధ్యమే: తమన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.