ETV Bharat / sitara

మరోసారి విభిన్న పాత్రలో శర్వానంద్​? - జాను సినిమా వార్తుల

టాలీవుడ్​ యువ హీరో శర్వానంద్​ ఓ వైవిధ్యమైన సినిమాలో నటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దివ్యాంగుడి కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

sharwanand
శర్వానంద్​
author img

By

Published : Aug 31, 2020, 11:29 AM IST

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శర్వానంద్​. పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా నటించి ప్రేక్షకుల చేత ఆహా అనిపించుకున్నాడు. అయితే, కొద్ది కాలంగా మంచి హిట్​కోసం కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాను చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్​ నడుస్తోంది. ప్రకాశ్​ అనే ఓ కొత్త దర్శకుడు వికలాంగుడి చుట్టూ తిరిగే కథను వినిపించగా.. శర్వాకు విపరీతంగా నచ్చేసిందట. దీంతో ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫేమస్​ కొరియోగ్రాఫర్​ రాజు సుందరం దర్శకత్వంలో మరో సినిమాను శర్వా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇటీవలే 'జాను' సినిమాతో పలకరించిన శర్వా.. తన నటనకు మంచి మార్కులే సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ సరికొత్త చిత్రాలతో ఏ విధంగా ఆకట్టుకుంటాడో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.