కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇలాంటి సమయంలోనూ 'మిర్చి' నటి రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి పిక్నిక్‌కి వెళ్లింది. గతేడాది అమెరికాకి చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకుందీ అందాల భామ.
పిక్నిక్కు వెళ్లిన జంట
కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ ఉన్నారట రిచా. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామగ్రిని కొనుగోలుకు మాత్రమే బయటకు వచ్చేవాళ్లట. అయితే తాజాగా రిచా తన భర్తతో కలిసి దగ్గరగా ఉన్న ఒరెగాన్ నదికి వెళ్లిందట. అయినా ఇద్దరూ భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని రిచా భర్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
-
So lucky to be able to enjoy a chill day with bae outdoors (while still social distancing!) #OregonCoast https://t.co/jHFp4xkdCC pic.twitter.com/UsCdOwMxb0
— Richa Langella (Gangopadhyay) (@richyricha) April 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So lucky to be able to enjoy a chill day with bae outdoors (while still social distancing!) #OregonCoast https://t.co/jHFp4xkdCC pic.twitter.com/UsCdOwMxb0
— Richa Langella (Gangopadhyay) (@richyricha) April 20, 2020So lucky to be able to enjoy a chill day with bae outdoors (while still social distancing!) #OregonCoast https://t.co/jHFp4xkdCC pic.twitter.com/UsCdOwMxb0
— Richa Langella (Gangopadhyay) (@richyricha) April 20, 2020
"కొన్ని వారాలపాటు ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అయినా సరే మనకు ఇష్టమైన పనులు చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ సరదగా ఉండొచ్చు"అని పేర్కొన్నాడు.
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ రవితేజతో కలిసి 'మిరపకాయ్', ప్రభాస్‌తో కలిసి 'మిర్చి' చిత్రంలో సందడి చేసింది.
ఇదీ చూడండి.. 'ఇంట్లో బతుకుతున్న మనమందరం అదృష్టవంతులం'