మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వైరస్ కోలుకున్నట్లు సోమవారం జరిపిన కొవిడ్ పరీక్షల్లో తేలిందని చెర్రీ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.
-
It feels good to be back !!! pic.twitter.com/5yqXQkPVtg
— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">It feels good to be back !!! pic.twitter.com/5yqXQkPVtg
— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2021It feels good to be back !!! pic.twitter.com/5yqXQkPVtg
— Ram Charan (@AlwaysRamCharan) January 12, 2021
"వైరస్ నుంచి కోలుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందనే వార్త మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మీరు నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు".
- రామ్‌చరణ్, కథానాయకుడు
గతేడాది డిసెంబరు 28న కరోనా బారిన పడినట్లు రామ్‌చరణ్ సోషల్‌మీడియాలో వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల స్వీయనిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు.
రామ్‌చరణ్ ప్రస్తుతం రెండు కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆచార్య'లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: హీరో రామ్‌చరణ్‌కు కరోనా పాజిటివ్