Alithosaradaga 'బిగ్‌బాస్' కార్యక్రమ విషయంలో చిన్న తప్పు చేశానని, ఒకానొక సమయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు వెళ్లాల్సి వచ్చిందని నటుడు అలీ రెజా తెలిపారు. అమిత్ తివారితో కలిసి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ విషయంతోపాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్నానని, మారేడుపల్లి ప్రాంతంలోని అందరితోనూ పరిచయం ఉందన్నారు. ‘ఇగో’ వల్ల తన భార్యతో రెండు సార్లు బ్రేకప్ (సరదాగా) అయిందని చెప్పారు. ‘టీవీలో కనిపించడం లేదేంటి?’ అని ఆలీ ప్రశ్నించగా నటుడిగా తన బ్యాన్ గురించి స్పందించారు.
తన కుటుంబం గురించి, దర్శకుడు త్రివిక్రమ్‌తో చేసిన ప్రయాణం గురించి అమిత్ తెలిపారు. 'పరువం వానగా' (రోజా) అనే పాటను విజిల్ రూపంలో ఆలపించి, అలరించారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరి ముచ్చట్ల పూర్తి ఎపిసోడ్ ‘ఈటీవీ’లో ఏప్రిల్ 4న రాత్రి 9.30 గం.లకు ప్రసారంకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'బీస్ట్' ట్రైలర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్.. 'పక్కా కమర్షియల్' విడుదల తేదీ ఖరారు