మలయాళ హీరో పృథ్వీరాజ్‌కు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు డైరెక్షన్ చేయమని ప్రతిపాదన వచ్చిందట. కానీ అతడు ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనందకు పృథ్వీ క్షమాపణ కూడా కోరాడట.
ఈ ఏడాది మొదట్లో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి దర్శకత్వం వహించాడు పృథ్వీరాజ్. ఆ సినిమా విడుదలైన తరువాతే రజనీకాంత్ నుంచి అవకాశం వచ్చింది. పృథ్వీ ఒక నటునిగానే కాక, గాయకుడు, నిర్మాతగాను వ్యవహరించాడు. ప్రస్తుతం పృథ్వీ చేతిలో 'ఆదు జీవితం', 'కడువ' చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన 'డ్రైవింగ్ లైసెన్స్' ప్రేక్షకులను అలరించింది.
మలయాళ నటుడు పృథ్వీ నటించిన 'ఉరుమి'.. తెలుగులో అదే పేరుతో అనువాదించారు. ఇక్కడా మంచి ఫలితాన్ని అందుకుంది.
ఇదీ చదవండి:- వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది!