ETV Bharat / sitara

డ్రగ్స్ కేసు: ఐదు గంటలపాటు సాగిన దీపిక విచారణ

author img

By

Published : Sep 26, 2020, 10:47 AM IST

Updated : Sep 26, 2020, 4:43 PM IST

Bollywood actor Deepika Padukone deposed before Narcotics Control Bureau (NCB) in a drug case related to the death of actor Sushant Singh Rajput.

Deepika Padukone
డ్రగ్​ కేసు

16:13 September 26

డ్రగ్స్ కేసులో ఎన్​సీబీ ఎదుట హాజరైన హీరోయిన్ దీపికా పదుకొణెను ఐదు గంటలపాటు అధికారులు విచారించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

13:08 September 26

ఎన్​సీబీ కార్యాలయానికి సారా ఆలీఖాన్​

ఎన్​సీబీ కార్యాలయానికి బాలీవుడ్​ నటి సారా ఆలీఖాన్​ కూడా చేరుకుంది. ఇప్పటికే దీపిక పదుకొణె, శ్రద్ధా కపూర్ విచారణ నిమిత్తం అధికారుల ముందు హాజరయ్యారు.​ 

12:20 September 26

ఎన్​సీబీ కార్యాలయానికి చేరుకున్న శ్రద్ధా

ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న శ్రద్ధా

నటి శ్రద్ధా కపూర్​ ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి చేరుకుంది. సుశాంత్​ మృతికి సంబంధించిన డ్రగ్​ కేసు విచారణ నిమిత్తం ఎన్​సీబీ ఆమెను ప్రశ్నించనుంది. 

10:18 September 26

ఎన్​సీబీ ఎదుట నటి దీపిక హాజరు

Deepika Padukone
దీపిక పదుకొణె

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్​సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం విచారణ నిమిత్తం నటి దీపికా పదుకొణె ఎన్​సీబీ కార్యాలయానికి వచ్చింది.  

ప్రస్తుతం సిద్ధాంత్​ చతుర్వేది, అనన్యా పాండేలతో కలిసి ఓ సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్న దీపిక.. అధికారుల ఆదేశాల మేరకు గోవా నుంచి ముంబయికి చేరుకుంది. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా నటి రకుల్​ ప్రీత్​ సింగ్​, నిర్మాత మధు మంతెనా, ధర్మ ప్రొడక్షన్స్​ రవిప్రసాద్​ వంటి వారిని అధికారులు ప్రశ్నించారు. దీపికతో పాటు సారా అలీఖాన్​, శ్రద్ధా కపూర్​ కూడా ఎన్​సీబీ ఎదుట హాజరుకానున్నారు.  

ఇటీవలే అరెస్టైన సుశాంత్​ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించగా.. పలువురు పేర్లు వెల్లడించినట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే వారందరికీ సమన్లు జారీ చేసినట్లు వివరించారు.

Last Updated : Sep 26, 2020, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.