ETV Bharat / sitara

మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​ - మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగటివ్​

మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. గత ఆదివారం కరోనా సోకిన తర్వాత తనలో లక్షణాలేవి లేకపోవడం వల్ల చిరు మరోసారి పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో నెగిటివ్​గా తేలింది. అయితే గతంలో చేసిన ఆర్టీ-పీసీఆర్​ టెస్ట్ సరిగ్గా​ పనిచేయకపోవడం వల్లే పొరపాటు జరిగినట్లు వైద్యులు తెలిపారని చిరు ట్వీట్​ చేశారు.

MegaStar Chiranjeevi tests negative for covid-19
మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​
author img

By

Published : Nov 12, 2020, 9:38 PM IST

మెగాస్టార్​ చిరంజీవికి కరోనా నెగిటివ్​గా నిర్ధరణ అయ్యింది. గత ఆదివారం కరోనా సోకిందని ట్విట్టర్​లో తెలిపిన చిరు.. తనలో వైరస్​ సోకిన లక్షణాలేవి కనిపించలేదన్నారు. అయితే మూడు రోజులు గడిచినా ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల మరోసారి పరీక్షలు చేయించుకున్నట్టు వెల్లడించిన మెగాస్టార్​.. నెగిటివ్​గా తేలినట్టు స్పష్టం చేశారు.

  • A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled ! 🙏❤️ pic.twitter.com/v8dwFvzznw

    — Chiranjeevi Konidela (@KChiruTweets) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కరోనా, కాలం.. ఈ రెండు కలిసి గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్​లో పాజిటివ్​ రిపోర్ట్​ అన్న తర్వాత, కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోవడం వల్ల, నాకే అనుమానం వచ్చి అపోలో వైద్యులను సంప్రదించాను. వాళ్లు నాకు సీటీ స్కాన్​ తీసి ఛాతి భాగంలో ఎలాంటి ట్రేసెస్​ లేవని నిర్ధరణకు వచ్చారు. అక్కడ చేసిన పరీక్షలో నెగిటివ్​గా వచ్చాక.. మరోచోట నివృత్తి చేసుకుందామని మరో మూడు రకాల కిట్స్​లతో పరీక్షలు చేయించాను. అన్నింటిలోనూ నెగిటివ్​గా తేలింది. చివరిగా ఆదివారం నాకు పాజిటివ్​ అని రిపోర్ట్​ ఇచ్చిన చోట కూడా ఆర్టీ-పీసీఆర్​తో పరీక్ష చేయించాను. అక్కడా వైరస్​ లేదని తెలిసింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు తప్పుగా వచ్చిందని వైద్యులు నిర్ధరణ చేశారు. ఈ సమయంలో మీరందరు చూపించిన ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు."

- చిరంజీవి, అగ్ర కథానాయకుడు

కరోనా ఆంక్షలు సడలించిన క్రమంలో మెగాస్టార్​ నటిస్తున్న 'ఆచార్య' చిత్రీకరణ తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైన క్రమంలో నటీనటులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించారు. ఆ టెస్ట్​ల్లో కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యినట్లు స్వయంగా చిరునే ఆదివారం వెల్లడించారు. అయితే చిరంజీవి స్వీయనిర్బంధంలో ఉన్న క్రమంలో దర్శకుడు కొరటాల శివ మిగిలిన నటీనటులతో చిత్రీకరణను ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.