క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన టాలీవుడ్ నటులు అల్లు అర్జున్, మహేశ్ బాబు అద్భుతంగా ఉందంటూ అభినందించారు. అయితే, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రం.. అక్కడా ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా చూసిన వారంతా ఊహించని మలుపులతో అదిరిపోయిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వెంకట్ రామ్‌జీ 'ఎవరు'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించాడు. పీవీపీ బ్యానర్లో ప్రసాద్ పొట్లూరి నిర్మాతగా వ్యవహరించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: నేను కోలుకున్నా.. మీరు జాగ్రత్త: నాగ్