ETV Bharat / sitara

వీళ్లను చూస్తే 'తెలుగమ్మాయి' అనుకుంటారు.. కానీ! - కృతిశెట్టి మూవీస్

చేసిన సినిమాలు వేళ్లపైనే లెక్కపెట్టొచ్చు కానీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఈ భామలు. తమ అందం, నటనతో పక్కా తెలుగమ్మాయిల్లానే మాయ చేశారు. సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా.. వాళ్లు కనబడితే ఫ్యాన్స్ విజిల్సే.. అతితక్కువ కాలంలోనే.. నటనలో తమకంటూ ప్రత్యేక ఫ్యాన్​ ఫాలోయింగ్ సంపాదించి.. తెలుగు చిత్రసీమలో దూసుకెళ్తున్న కథానాయికలు వీళ్లు. వారి గురించే ఈ ప్రత్యేక కథనం.

cinema heroines
హీరోయిన్లు
author img

By

Published : Sep 29, 2021, 6:00 PM IST

తెరపై ఎంతోమంది హీరోయిన్​లు సందడి చేస్తుంటారు.. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మదిని దోచుకుంటారు. తెలుగమ్మాయిలే అనుకునేంతుగా.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు టాలీవుడ్​లోని పలువురు కథానాయికలు. చేసింది.. ఒకటి, రెండు సినిమాలే అయినా తమ అందం, అభినయం, నటనతో సినీప్రియల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఇంతకీ వాళ్లెవరు? వారి సంగతేంటి?

భానుమతి ఒక్కటే పీస్

భానుమతి ఒక్కటే పీస్​.. అంటూ తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi Movies). 2017లో వచ్చిన 'ఫిదా'లో తెలంగాణ యాసలో ఆమె పలికిన సంభాషణలు ఇప్పటికీ మనకు గుర్తుంటాయి. సాయిపల్లవి(Sai Pallavi Movies) స్వస్థలం తమిళనాడు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమమ్​( 2017) చిత్రంతో హీరోయిన్​గా మారింది.

.
.
.
.
.
.

'ఫిదా' తర్వాత సాయిపల్లవి తెలుగులో ఓ ప్రభంజనమే సృష్టించింది. మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ) చిత్రంలో నానికు పోటీగా నటించి ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన 'లవ్​స్టోరి'లో తెలంగాణ యాసతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మరోసారి మాయ చేసింది సాయిపల్లవి(Sai Pallavi Movies). నటనలోనే కాదు డ్యాన్స్​లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జార్జియాలో ఈమె ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడం విశేషం.

.
.
.
.

ప్రస్తుతం విరాట పర్వం(Virata Parvam Release Date), శ్యామ్​ సింగరాయ్(Shyam Singha Roy Heroine) చిత్రాల్లో హీరోయిన్​గా నటిస్తోంది.

జ్వరం కావాలా?

చేసింది ఒక్కటే సినిమా కానీ.. కుర్రకారు గుండెల్లో 'ఉప్పెన' సృష్టించింది కృతిశెట్టి(Krithi Shetty Movies). ఈ ఏడాది విడుదలైన 'ఉప్పెన' చిత్రంతో నటిగా పరిచయమైన ఈ యువ సంచలనం.. తన నటన, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'బేబమ్మ'గా తెలుగు యువత గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

.
.
.
.
.
.

జ్వరం కావాలా..? అంటూ కృతి చెప్పే డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించింది కృతిశెట్టి. 2003, సెప్టెంబరు 1న(Krithi Shetty Date Of Birth) కర్ణాటకలో జన్మించింది. ఒక్కసినిమాతోనే అగ్రహీరోయిన్​ అయిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ(Krithi Shetty Movies).

.
.

'శ్యామ్​ సింగరాయ్'​, 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి', 'బంగార్రాజు'(Krithi Shetty Movies) చిత్రాలతో ఈమె బిజీగా ఉంది.

మహానటిగా..

తన నటనతో అలనాటి మహానటి(Mahanati Actress) సావిత్రిని మళ్లీ గుర్తుకు తెచ్చింది కీర్తి సురేశ్​. 'మహానటి'లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలనాటి సావిత్రిని అభిమానులు, కీర్తి సురేశ్​లో చూసుకున్నారు. ఈ చిత్రంతోనే ఆమెకు జాతీయస్థాయిలో అవార్డు(Mahanati Awards) కూడా దక్కడం విశేషం. 1992, అక్టోబరు 17న చెన్నైలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ.

.
.
.
.
.
.

2016లో విడుదలైన 'నేను శైలజ'(Keerthy Suresh Movies) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కీర్తి సురేశ్​.. మొదటి సినిమాతోనే మంచి నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేను లోకల్', 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో'(Keerthy Suresh Movies) మెరిసింది.

.
.

ప్రస్తుతం 'సర్కారువారి పాట'(Sarkaru Vaari Paata Release Date) చిత్రంలో మహేశ్​బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. అంతేకాక రజనీకాంత్ 'అన్నాత్తె', అజయ్ దేవ్​గణ్ 'మైదాన్' చిత్రాలతో బిజీగా ఉంది.

నటనలో ది గ్రేట్..

చూడగానే తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది నివేథా థామస్(nivetha thomas movies). కానీ ఈ భామ స్వస్థలం కేరళ. 2016లో విడుదలైన 'జెంటిల్​మెన్​' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. మొదటి చిత్రంలోనే హీరో నానితో సమానంగా నటించి.. ప్రశంసలు దక్కించుకుంది.

.
.
.
.
.
.

ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాలు చేసి ప్రేక్షకులకు దగ్గరైంది. 'నిన్నుకోరి', 'జై లవకుశ', '118', 'బ్రోచేవారెవరురా', 'వకీల్ సాబ్'​ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది(Nivetha Thomas Movies List) ఈ కేరళ కుట్టి(Nivetha Thomas Movies). ప్రస్తుతం 'మీట్ క్యూట్'​ అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది.

వీరే కాదు.. స్నేహ, అనుష్క, శ్రియ లాంటి పలువురు హీరోయిన్లు కూడా తెలుగమ్మాయిలే అనిపించేంతలా నటించి, మెప్పించారు. ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు.

ఇదీ చదవండి: 'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.