భోజ్‌పురీ సినీనటి అనుపమ పాథక్ బలవన్మరణానికి పాల్పడింది. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ.. ముంబయికి వచ్చి భోజ్‌పురి సినిమాలు, టీవీ షోలలో నటించింది.
అనుపమ ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. అందులో ఆమె మోసపోయినట్లు పేర్కొంటూ.. ప్రస్తుతం తాను ఎవ్వరిని నమ్మలేకపోతున్నాని వెల్లడించింది.
బాలీవుడ్లో ఆత్మహత్యలు
గత మూడు నెలల వ్యవధిలో ఇద్దరు బాలీవుడ్ నటీనటులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్.. జూన్ 14న అతని నివాసంలో ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మే 15న బుల్లితెర నటుడు మన్మీత్ గ్రెవాల్ ఉరి వేసుకుని చనిపోయాడు.