ETV Bharat / sitara

'అఖండ' తర్వాత మారిన బాలయ్య లెక్క.. రెమ్యూనరేషన్ భారీగా పెంపు! - బాలయ్య మూవీస్

Balayya remuneration: వెండితెరపై 'అఖండ', ఓటీటీలో 'అన్​స్టాపబుల్' టాక్​షోతో బ్లాక్​బస్టర్లు అందుకున్న బాలయ్య.. తన లెక్క మార్చారు. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్​ను భారీగా పెంచినట్లు తెలుస్తుంది.

balayya remuneration hike
బాలయ్య
author img

By

Published : Jan 10, 2022, 1:41 PM IST

Balakrishna Akhanda movie: నందమూరి బాలకృష్ణ 'అఖండ'.. బాక్సాఫీస్​ దగ్గర అదరగొట్టేసింది. గతేడాది డిసెంబరులో వచ్చిన ఈ సినిమా.. వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. సరిగ్గా ఇదే సమయంలో ఓటీటీలోనూ 'అన్​స్టాపబుల్' టాక్ షో హోస్ట్​గా బాలయ్య దుమ్మురేపారు. తనదైన మార్క్​ టైమింగ్, పంచులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సినిమాలకు బాలయ్య తన రెమ్యూనరేషన్​ను పెంచేసినట్లు తెలుస్తోంది.

balayya akhanda
బాలయ్య 'అఖండ'

'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' ప్రస్తుత సీజన్​లో బాలయ్య ఒక్కో ఎపిసోడ్​ కోసం దాదాపు రూ.40 లక్షలకుపైగానే తీసుకుంటున్నారట. దీంతో మొత్తం 12 ఎపిసోడ్లు పూర్తిచేసేసరికి ఆయన దాదాపు రూ.6 కోట్లు ఆర్జించనున్నారని సమాచారం. ఈ మొత్తం 'అఖండ' కోసం బాలయ్య తీసుకున్న రెమ్యూనరేషన్​లో సగం!

ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా కోసం సరికొత్తగా సిద్ధమవుతున్న బాలయ్య.. దాదాపు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్​ తీసుకోనున్నారట. ఆ తర్వాత చేయబోయే సినిమాలకూ ఇంతే మొత్తం అందుకోనున్నట్లు తెలుస్తోంది.

unstoppable vijay devarakonda episode
'అన్​స్టాపబుల్' కొత్త ఎపిసోడ్

Unstoppable with nbk: ప్రస్తుతం 'అన్​స్టాపబుల్' షో ఎనిమిది ఎపిసోడ్లు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న తొమ్మిదో ఎపిసోడ్​ విడుదల కానుంది. ఇందులో హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి హాజరయ్యారు.

అలానే బాలయ్య టాక్ షో రేటింగ్స్​లోనూ 'అన్​స్టాపబుల్'గా నిలిచింది. 9.7 రేటింగ్​ సాధించి, దక్షిణాది నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి టాక్​ షోగా రికార్డు సృష్టించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.