బాలీవుడ్ జోడి రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇప్పుడు రణ్బీర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అతడికి శుభాకాంక్షలు చెప్పిందీ హీరోయిన్. వీరిద్దరూ కెన్యాలో దిగిన ఫొటోను షేర్ చేసి కేక్ ఎమోజీని జత చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తొలిసారి జంటగా తెరపై సందడి చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది మేలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చూడండి.. పూరీ మంచి స్నేహితుడు: ఛార్మి