ETV Bharat / sitara

'అంగ్రేజీ మీడియం'కు సీక్వెల్​గా 'చైనీస్​ మీడియం' - 'అంగ్రేజీ మీడియం' సీక్వెల్​గా చైనీస్​ మీడియం రానుందా

బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ ఖాన్​ నటించిన 'అంగ్రేజీ మీడియం'కు సీక్వెల్​గా 'చైనీస్ మీడియం' తీయనున్నట్లు నిర్మాత దినేశ్ చెప్పారు.

Angrezi Medium
ఆంగ్రేజీ మీడియానికి సీక్వెల్​గా చైనీస్​ మీడియం
author img

By

Published : Mar 13, 2020, 8:49 AM IST

అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఆ తర్వాత ఇతడు, హాలీవుడ్​లోనూ పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'అంగ్రేజీ మీడియం'లో నటించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. 2017లో విడుదలైన 'హిందీ మీడియం'కు సీక్వెల్​ ఇది. కేవలం రూ.22 కోట్లతో తెరకెక్కిన తొలి భాగం.. రూ.110 కోట్లు కొలగొట్టింది.

ఇప్పుడు 'అంగ్రేజీ​ మీడియం'కు సీక్వెల్​గా 'చైనీస్​ మీడియం' తీయనున్నట్లు స్పష్టం చేశారు నిర్మాత దినేశ్​​ విజన్​.

"హిందీ మీడియం చైనాలో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కిన 'అంగ్రేజీ మీడియం'ను కొన్ని నెలల తర్వాత చైనాలో విడుదల చేస్తాం. ఇదీ తప్పక విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం. దీనికి సీక్వెల్​గా చైనీస్​ మీడియాన్ని తీయాలనుకుంటున్నాం. ఎందుకంటే చైనీయులు ప్రపంచమంతటా ఉన్నారు. వారు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లినప్పుడు భాష పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నాం" -దినేశ్​​ విజన్, నిర్మాత

హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కరీనా కపూర్​, రాధికా మదన్​, పంకజ్​ త్రిపాఠి, దీపక్​ దోబ్రియల్​, డింపుల్​ కపాడియా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కథేంటి
స్కూల్‌ విద్య పూర్తి చేసుకున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ కుమార్తె ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లాలనుకుంటుంది. అక్కడ ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే రూ.కోటి ఫీజు కట్టాలి. అది ఇర్ఫాన్‌కు తలకు మించిన భారం. అయినా సరే అక్కడే చదవాలన్నది కూతురి కల. వారంలో ఫీజు కట్టకపోతే ఆ సీటు కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో కోటి రూపాయలు సంపాదించడానికి ఇర్ఫాన్‌ చేసిన ప్రయత్నాలేంటి? లండన్‌లో పోలీస్‌గా పనిచేసే కరీనాకు, ఇర్ఫాన్‌కు మధ్య సంబంధం ఏంటి? ఇర్ఫాన్‌ కూతురి కోరికను నెరవేర్చాడా లేదా అన్నది తెరపై చూడాలి.

అంగ్రేజీ మీడియం
అంగ్రేజీ మీడియం
kareena kapoor
అంగ్రేజీ మీడియంలో కరీనాకపూర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.