ETV Bharat / science-and-technology

ట్విట్టర్​లో నయా ఫీచర్.. ఇక ఒకే పోస్ట్​లో ఫొటో, వీడియో, జిఫ్! - ట్విట్టర్​ ఆండ్రాయిడ్​ అప్డేట్​

ట్విట్టర్​ మరో ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఒకే ట్వీట్​లో ఫొటో, వీడియో, జిఫ్​లు కలిపి పోస్ట్ చేసే వీలు కల్పించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 6, 2022, 1:30 PM IST

మనం సాధారణంగా ట్విట్టర్​లో ఏదైనా పోస్ట్​ చేయాలంటే టెక్స్ట్​టో పాటు ఫోటోలు లేదా వీడియోలను జత చేస్తాం. ఇతర యాప్స్​లో ఫొటోలు, వీడియోలు ఒకే పోస్ట్​కు జత చేయచ్చు. కానీ ట్విట్టర్​లో ఆ ఆప్షన్​ అందుబాటులో లేదు. ఫొటో, వీడియో, జిఫ్​ ఇమేజ్​ ఇలా అనేక రకాల మీడియా ఉన్నప్పటికీ వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఒక పోస్ట్​లో అప్​లోడ్​ చేసే అవకాశం ఉండేది. ఒకే సారి ఫొటోతో పాటు వీడియో జత చేయాలంటే పెద్ద సమస్య అనే చెప్పాలి.

ఇప్పుడా సమస్య లేదంటోంది ట్విట్టర్​ యాజమాన్యం. ఇకపై మూడు ఫార్మాట్లను ఒకే పోస్ట్​కు జత చేయగలిగేలా ఓ అప్డేట్​ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్​ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్​తో పాటు ఐఓఎస్​లోనూ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇంతకు ముందు, వివిధ మీడియా ఫార్మాట్లను ట్వీట్​లో ఉపయోగించాలంటే వాటిని వేర్వేరు ట్వీట్లలో లేదా థ్రెడ్‌లో కంపోజ్ చేయాల్సి​ ఉండేది. ఇప్పుడా అవసరం లేదని సంస్థ తెలిపింది.

ట్వీట్ కంపోజర్‌ను ఓపెన్​ చేసి ఫొటోలు, మీమ్‌లు, జిఫ్​ ఇమేజ్​, వీడియో లాంటి నాలుగు రకాల మీడియాలను ఒకే సారి అప్​లోడ్​ చేయొచ్చని తెలిపింది ట్విట్టర్. అంతే కాకుండా ట్వీట్‌ను కంపోజ్ చేస్తున్నప్పుడు వారు తమ మీడియా లే అవుట్‌ను కూడా మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆంగ్లంలో ట్విట్టర్‌ను ఉపయోగించే ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే ఇప్పుడు ఈ ఫీచర్​ను ఉపయోగించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

మీడియా ట్వీట్​ను కంపోజ్​ చేయడం ఎలా ??

  • ట్విట్టర్​లోని హోమ్​ పేజ్​కు వెళ్లాలి.
  • అక్కడ వాట్స్​ హ్యాపెనింగ్​ అనే ట్వీట్​ కంపోజింగ్​ బాక్స్​ కనిపిస్తుంది.
  • బాక్స్​లో ఫొటో, పోల్​ ఎమోజీ ఐకాన్లు కనిపిస్తాయి.
  • వాటిలో ఇమేజ్​ ఆప్షన్​ను ఎంచుకుని మిగతా మీడియాను యాడ్ చేయాలి. అంతే మల్టిపుల్​ మీడియా ట్వీట్​ ఇక సృష్టించేయచ్చు ఈజీగా.

ఇదీ చదవండి: జియో ల్యాప్​టాప్​ రిలీజ్.. ధర రూ.20వేలు లోపే!

ఎవరైనా అడిగితే ఓటీపీ చెప్పేస్తున్నారా?.. అయితే జాగ్రత్త పడాల్సిందే!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.