ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా.. మరి ఈ మార్పులు చేశారా? - ఆండ్రాయిడ్​​ ఫోన్​లో డార్క్​మోడ్​ సెట్టింగ్స్​

ఆండ్రాయిడ్​ ఫోన్లలో(Android Phone) సెట్టింగ్స్​ను యూజర్ తన​ అవసరాలకు తగినవిధంగా మార్చుకోవచ్చు. ఫలితంగా ఫోన్‌ బ్యాటరీ పనితీరు మెరుగవడం సహా మీ డివైజ్‌ను ఇతరులు దొంగిలించినా ఎక్కడ ఉందనేది సులువుగా తెలుసుకోవచ్చు. డార్క్‌మోడ్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఓ లుక్కేయండి!

Android Phone
ఆండ్రాయిడ్ ఫోన్​
author img

By

Published : Nov 22, 2021, 12:18 PM IST

కొత్త ఫోన్‌ కొన్న తర్వాత చాలా మంది తమ అవసరాలకు తగినట్లుగా ఫోన్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తుంటారు. అయితే ఇవి యూజర్స్‌ అందరికీ ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకు మీరు ఫోన్‌ తక్కువగా ఉపయోగించేట్లయితే ఆండ్రాయిడ్(Android Phone) ఓఎస్‌ డీఫాల్ట్‌ (ఫోన్ తయారయినప్పుడు ఉండే మార్పులు) సెట్టింగ్స్‌ను కొనసాగిస్తే సరిపోతుంది. అలా కాకుండా రోజులో ఎక్కువసేపు.. అదేనండి యావరేజ్‌ లేదా ప్రో యూజర్‌ అయితే మీ అవసరాలకు తగినట్లుగా ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సివుంటుంది. వాటివల్ల ఫోన్‌ బ్యాటరీ పనితీరు మెరుగవడంతోపాటు, మీ డివైజ్‌ను ఇతరులు దొంగిలించినా ఎక్కడ ఉందనేది సులువుగా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటి? వాటిని ఎలా మార్చాలనేది తెలుసుకుందాం.

హోమ్‌ స్క్రీన్‌ (Home Screen)

ఫోన్‌లో కొత్త యాప్స్‌ డౌన్‌లోడ్ చేసిన ప్రతిసారీ వాటికి సంబంధించిన షార్ట్‌కట్‌ లేదా ఐకాన్‌ ఫోన్‌ హోమ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అలానే యాప్‌ కొత్త వెర్షన్‌ అప్‌డేట్ అయినా ఐకాన్‌ హోమ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ ఐకాన్స్‌ని ప్రతిసారీ తొలగించడం కొంత చికాకు కలిగిస్తుంది. కొత్త యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినా, యాప్‌ అప్‌డేట్ అయినా ఐకాన్‌ హోమ్‌ స్క్రీన్‌ మీద కనిపించకుండా సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేస్తే సరిపోతుంది. ఫోన్‌ మెనూలో హోమ్‌ స్క్రీన్‌ కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో షో యాప్స్‌ స్క్రీన్‌ బటన్‌ లేదా యాడ్ ఐకాన్‌ టు హోమ్‌ స్క్రీన్‌ అనే ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు హోమ్‌ స్క్రీన్‌ మీద యాప్‌ ఐకాన్స్‌ కావాలంటే మెనూ నుంచి వాటిని డ్రాగ్ (యాప్‌ ఐకాన్‌పై వేలితో నొక్కిపట్టి పక్కకు లాగటం) చేయొచ్చు.

Home Screen
హోమ్‌ స్క్రీన్‌

డార్క్‌మోడ్‌ (Dark Mode)

బ్యాటరీ పనితీరు మెరుగయ్యేందుకు ఉపయోగపడే మరో ఫీచర్‌ డార్క్‌మోడ్‌. అయితే ఆండ్రాయిడ్ 10 ఆపై ఓఎస్‌తో పనిచేసే ఫోన్లలో తప్పనిసరిగా ఈ 'డార్క్‌మోడ్‌' ఫీచర్‌ ఉంటుంది. అలానే డార్క్‌మోడ్‌లో ఫోన్ ఉపయోగిస్తే కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ లైఫ్(Android Phone battery life) పెరుగుతుందని ఇటీవల గూగుల్ పరిశోధనలో నిరూపితమైంది. దీనికోసం ఫోన్ సెట్టింగ్స్‌లో డిప్‌స్లే ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్‌మోడ్‌ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. అలాకాకుంటే నోటిఫికేషన్‌ సెంటర్ పైభాగంలో ఉన్న సెట్టింగ్స్‌ షార్ట్‌కట్స్‌లో కూడా డార్క్‌మోడ్‌ ఫీచర్‌ కనిపిప్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ ఫీచర్‌ ఆన్‌ అవుతుంది. ఒవవేళ మీరు ఆండ్రాయిడ్ 10 కన్నా తక్కువ వెర్షన్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్ ఉపయోగిస్తుంటే డార్క్‌మోడ్‌ థర్డ్‌పార్టీ యాప్స్‌తో ఫోన్‌లో డార్క్‌మోడ్‌ ఎనేబుల్ చేయొచ్చు.

Dark Mode
డార్క్‌మోడ్‌

ఫైండ్‌ మై డివైజ్‌ (Find My Device)

ముచ్చటపడి కొన్న ఫోన్‌.. ఎక్కువ రోజులు వాడకుండానే దొంగతనానికి గురయితే.. ఎంతో బాధ కలుగుతుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా గూగుల్‌ 'ఫైండ్ మై డివైజ్‌' ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యూజర్స్‌ తమ ఫోన్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. ఫోన్ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ బార్‌లో ఫైండ్‌ మై డివైజ్‌ అని టైప్ చేయాలి. లేదా సెట్టింగ్స్‌లో బయోమెట్రిక్‌ అండ్‌ సెక్యూరిటీలోకి వెళ్లాలి. అందులో ఫైండ్ మై డివైజ్‌ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. తర్వాత ఆండ్రాయిడ్.కామ్‌ లేదా మొబైల్‌ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో మీ మెయిల్‌ ఐడీతో లాగిన్‌ కావాలి. తర్వాత మీరు ఫోన్‌ని ఎవరైనా దొంగిలిస్తే పీసీ లేదా మొబైల్‌లో ఆండ్రాయిడ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు.

Find My Device
ఫైండ్‌ మై డివైజ్‌

బ్యాటరీ లైఫ్‌ (Battery Life)

ఫోన్ అనగానే ఎదుటివారి నుంచి ముందుగా ఎదురయ్యే ప్రశ్న బ్యాటరీ బ్యాకప్‌(Android Phone battery life) ఎలా ఉంది. అంటే బ్యాటరీ ఎంతసేపట్లో ఛార్జ్‌ అవుతుంది. అలానే ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుందనే ప్రశ్న వినిపిస్తుంది. అందుకే ఫోన్ కొన్న రోజు నుంచి బ్యాటరీ సెట్టింగ్స్‌కి సంబంధించి కొన్ని మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ జీవితకాలం మెరుగవడంతోపాటు ఎక్కువరోజులు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందకోసం ఫోన్‌లో స్క్రీన్‌ ఆటో బ్రైట్‌నెస్‌ని ఆఫ్‌ చేయమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. బ్రైట్‌నెస్ లెవల్‌ని ఎప్పుడూ 50 శాతం కంటే కింద ఉంచడం మేలంటున్నారు. స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ కోసం ఫోన్ ఎక్కువ బ్యాటరీ ఉపయోగిస్తుంది. దాంతో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుందనేది పలువురు టెక్‌ నిపుణుల అభిప్రాయం. అయితే మరికొంతమంది మాత్రం ఆటో బ్రైట్‌నెస్‌ ఉపయోగించడం మేలని సూచిస్తున్నారు. అందుకే ఆటో బ్రైట్‌నెస్‌, అడాప్టివ్‌ బ్యాటరీ, బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ వంటి వాటిని మీ అవసరాలకు తగినట్లుగా మార్చుకోవడం ఉత్తమం.

Battery Life
బ్యాటరీ లైఫ్‌

డో నాట్‌ డిస్ట్రబ్‌ (Do Not Disturb)

రాత్రులు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్‌ నోటిఫికేషన్స్‌, కాల్స్‌, మెసేజెస్‌తో నిద్రాభంగం కలుగుతుంది. ఒకవేళ నిద్రకు ఉపక్రమించే ముందయితే వాటి ధ్యాసలో పడి ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం.. దాని ప్రభావం మరుసటిరోజు ప్రణాళికపై ఉంటుంది. అందుకే రాత్రులు నిద్రాభంగం కలగకుండా ఆండ్రాయిడ్ 'డో నాట్ డిస్ట్రబ్‌' మోడ్‌ను పరిచయం చేసింది. అలానే మీరు గేమ్స్‌ ఆడేప్పుడు లేదా సినిమాలు చూసేప్పుడు ఈ మోడ్‌ని ఎనేబుల్ చేస్తే మెసేజ్ నోటిఫికేషన్స్‌, కాల్స్‌ వంటివి స్క్రీన్‌పై కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం అవుతాయి. ఒకవేళ మీరు రాత్రులు ఈ మోడ్‌ని ఉపయోగించాలనుకుంటే మీరు నిద్రపోయే సమయానికి అనుగుణంగా టైమ్‌ లిమిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మీరు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్రపోతారనుకుంటే.. ఆ టైంని డో నాట్ డిస్ట్రబ్‌ మోడ్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత ఆ సమయంలో మీకు ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌, నోటిఫికేషన్స్ వచ్చినా..ఫోన్ నుంచి ఎలాంటి సౌండ్ వినిపించదు. పొద్దున్నే మీరు ఫోన్‌ చూసేంతవరకు అప్పటి వరకు వచ్చిన ఫోన్‌కాల్స్‌, మెసేజెస్‌ వివరాలు నోటిఫికేషన్‌ సెంటర్‌లో కనిపిస్తాయి.

Do Not Disturb
డునాట్‌ డిస్ట్రబ్‌

Note: పైన పేర్కొన్న సెట్టింగ్స్‌ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకేవిధంగా ఉండవు. ఫోన్‌ కంపెనీ ఆధారంగా ఒక్కో మోడల్‌ సెట్టింగ్స్‌లో పేర్లు కొద్దిగా మారుతాయి.

ఇదీ చూడండి: తక్కువ ధరలో ట్యాబ్ కొనాలా? ఇవి చూడండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.