దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. ఈ ఏడాది సరికొత్త ఎస్‌యూవీకి శ్రీకారం చుట్టనుంది. ఎక్స్‌యూవీ700 పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్స్ ఫీచర్‌తో కూడిన ఎక్స్‌యూవీ700 మోడల్.. 2022లో రానున్నట్లు ఇటీవల విడుదల చేసిన టీజర్ వీడియోలో స్పష్టం చేసింది. సంస్థ ప్రణాళికలో భాగంగా.. 2026 నాటికి తొమ్మిది సిరీస్‌లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఎక్స్‌యూవీ 700తో పాటు న్యూ-జెన్ స్కార్పియో, ఆల్-న్యూ బొలేరో, థార్ లాంగర్ వెర్షన్లు ఉన్నాయి.
-
When you're in the mood to burn up the roads, the #XUV700 will light your way.#HelloXUV700 #HelloAutoBoosterHeadlampshttps://t.co/a4cot1Y7q2 pic.twitter.com/osINDKO5nE
— MahindraXUV700 (@MahindraXUV700) June 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">When you're in the mood to burn up the roads, the #XUV700 will light your way.#HelloXUV700 #HelloAutoBoosterHeadlampshttps://t.co/a4cot1Y7q2 pic.twitter.com/osINDKO5nE
— MahindraXUV700 (@MahindraXUV700) June 24, 2021When you're in the mood to burn up the roads, the #XUV700 will light your way.#HelloXUV700 #HelloAutoBoosterHeadlampshttps://t.co/a4cot1Y7q2 pic.twitter.com/osINDKO5nE
— MahindraXUV700 (@MahindraXUV700) June 24, 2021
అయితే.. స్పీడ్ 80 కిలోమీటర్ల వేగాన్ని దాటినప్పుడు ఎక్స్‌యూవీ700కి హెడ్ ల్యాంప్స్ ఆటోమెటిక్‌గా యాక్టివేట్ అవుతాయని సంస్థ పేర్కొంది. రాత్రి సమయాల్లో ప్రయాణిస్తే ఫ్రంట్ వ్యూ పెరుగుతుందని తెలిపింది.
ఈ కొత్త ఎస్యూవీ మోడల్‌కి పూర్తిగా డిజిటల్ ఉపకరణాలను అమర్చనున్నట్లు సమాచారం. సీ ఆకృతి లెడ్ డీఆర్ఎల్స్, ఆరు వర్టికల్ స్లాట్స్‌తో కూడిన న్యూ ఫ్రంట్ మెయిన్ గ్రిల్, సీ ఆకృతి టైల్ లైట్స్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఫ్రంట్ సీట్స్ మెమొరీ ఫంక్షన్, రోటరీ డయల్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్‌ను కూడా అమరుస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఇదీ చదవండి: అల్కాజర్ లుక్ అదుర్స్- ఎం&ఎం నుంచి ఎక్స్‌యూవీ 700